Ads
వాళ్లంతా దేశం కోసం ఫైట్ చేసే సైనికులు , కానీ తమ మీదకి దాడికి దిగిన కోతులని ఏం చేయలేక తలలు పట్టుకున్నారు . మొత్తనికి కోతుల బెడద నుండి తప్పించుకోవడానికి కొత్త ప్లాన్ వేశారు. సారీ ప్లాన్ కాదు కొత్త వేషం వేసారు. కోతులని తరిమికొట్టడానికి ఎలుగు బంట్ల అవతారం ఎత్తారు . మరి మన సైనికుల్ని చూసి కోతులు పారిపోయాయా? దానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
Video Advertisement
ఉత్తరాఖండ్‌లోని మిర్థిలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు క్యాంపులో కోతులు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని తప్పించుకోవడానికి, తరిమేయడానికి అక్కడ సైనికులు, అధికారులు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. కానీ మనోళ్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ కోతుల బెడద నుండి మాత్రం తప్పించుకోలేకపోయారు. చేసేదేం లేక, కోతుల బాధపడలేక ఎలుగు బంట్ల వేషం వేసుకుని వాటిని భయపెట్టాలనుకున్నారు.
క్యాంపులో ఉన్న కొందరు జవాన్ల చేత ఎలుగుబంటి వేషం వేయించారు. కోతులు వచ్చినప్పుడు క్యాంపు పరిసరాల్లో తిరగడం మన ఎలుగుబంట్ల డ్యూటీ. మారు వేషంలో ఉన్న సైనికులను చూసిన కోతులు నిజంగానే ఎలుగుబంట్లు వచ్చాయనుకుని ఒకటే పరుగే పరుగు.
ఎలుగుబంట్లను చూడగానే కోతులన్ని ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్టుగా పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆర్మీ తెలివికి నవ్వుకుంటున్నారు . ప్రాణాలకి తెగించి ఒక దేశంతో పోరాడే సైనికుడు కోతులని మాత్రం మారువేషంలో ఎదుర్కోవాల్సొచ్చింది.
watch video:
End of Article