Ads
బుల్లితెర మీద కొన్ని సీరియల్లు ఆసక్తిగా కొనసాగుతూ ఉంటాయి. అలాంటి సీరియల్ నే స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి. ఈ సీరియల్ సంవత్సరం నుండి ప్రసారమవుతున్న కూడా రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతుంది. నేపథ్యంలో మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసా…!
Video Advertisement
ఆదర్శ్ వచ్చిన తర్వాత ముకుంద తీరును గమనించిన భవానీ దేవికి ఆమెపై అనుమానం మొదలవుతుంది. అంతలో రేవతి వచ్చి మరో పంతులును పిలిచి శోభనాలకు ముహూర్తం పెట్టిద్దాం అంటుంది. ఆ సమయంలో భవానీ దేవి తన అనుమానాలను రేవతికి చెబుతుంది. మరోవైపు..ఆదర్శ్‌కు కూడా ముకుంద తీరుపై డౌట్ వస్తుంది. కానీ…తను నిజంగానే మారిందని అతడు నమ్ముతాడు.అయితే ముకుంద ఎందుకు అరిచిందో తెలుసుకునేందుకు ఆదర్శ్‌తో మందు తాగించాలనుకుంటాడు మధు. అప్పుడు మురారి కూడా వాళ్లతో కలుస్తానని చెబుతాడు.
ఆదర్శ్‌తో పాటు అందరూ మందు తాగుతుంటారు. అప్పుడు ప్రసాద్ ఓవర్ యాక్షన్ చేస్తే.. భార్య వచ్చి తిడితే ఫీల్ అవుతాడు. ఆ సమయంలోనే ముకుంద ఆదర్శ్ కోసం వెతుకుతూ…ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడతాడో జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి అనుకుంటుంది. మధు మాత్రం ఎలాగైనా తొండ టాపిక్ బయట పెట్టించాలని…మార్నింగ్ మనం డిస్కస్ చేస్తుంటే అమ్మ వచ్చి డిస్ట్రబ్ చేసింది కదా. మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందామా అని అడుగుతాడు. అప్పుడే ముకుంద బయటకి వచ్చి వాళ్లను చూస్తుంది.
మధు మాటలకు మురారి అంత సీరియస్ మేటర్ ఏంటి అంటే… తొండ టాపిక్ అంటాడు. దీంతో పక్కనే ఉండి చూస్తున్న ముకుంద …ఏదైతే జరగకూడదు అని భయపడ్డానో అదే జరుగుతుంది. మధుకి అనుమానం వచ్చింది. తాగిన మత్తులో ఆదర్శ్ నిజం చెప్పేస్తాడేమో…. అని టెన్షన్ పడుతుంది. అప్పుడు మధు తొండ పడితే ఉలిక్కిపడి పక్కకి జరుగుతారు కానీ.. భూమి బద్ధలైనట్టు ఎందుకు అరుస్తారు అంటాడు. దీనికి మురారి అవును కరెక్టే కదా అంటాడు. దీనికి ఆదర్శ్ నాకొక విషయం అర్థమైంది. అక్కడ ఏదో జరిగిందని మీకు అనుమానం కదా అంటాడు.
ఆదర్శ్ వాళ్లు నిజం చెప్పేలా ఉన్నాడని గ్రహించిన ముకుంద వెంటనే కృష్ణను తీసుకొచ్చి అడ్డుకోవాలని చూస్తుంది. వెంటనే… మురారి ఆదర్శ్ అంతా కలిసి మందు తాగుతున్నారు అని చెప్తుంది. అప్పుడామె అంతేనా.. వాళ్ళు తాగుతున్న విషయం ముందే నాకు చెప్పారులే.. అని లైట్ తీసుకుంటుంది. దీంతో ముకుంద అంటే ఏంటి కృష్ణ.. మా ఆయనను చెడగొట్టమని మీ ఆయనను పంపించావా అని సీరియస్ అవుతుంది. దీంతో కృష్ణ ఆదర్శ్‌కు మందు అలవాటు ఉంది కదా. మిలటరీలో రోజు తాగుతారు అంటుంది. అప్పుడు ముకుంద ఇక్కడ తాగొద్దు అంటుంది.
ఆ తర్వాత ముకుంద అత్తయ్య చూస్తే మేం సరిగా లేము అందుకే తాగుతున్నాడని అనుకుంటుంది అంటుంది. దీంతో కృష్ణ ఆమె మాటలు నమ్మి మందు తాగకుండా వాళ్ళను ఆపడానికి వెళ్తుంది. వెళ్లగానే ముకుంద తాగింది చాలు అందరూ లేవండి అని సీరియస్‌గా చెప్పడంతో ఆదర్శ్ లేస్తాడు. అప్పుడామె నా మీద తొండ పడలేదని మధుకి గట్టిగా అనుమానం వచ్చింది. టైమ్‌కు వెళ్లాను కాబట్టి సరిపోయింది. లేదంటే మేము ఎలా ఉంటున్నామో తెలిసిపోయేది. అయినా తెలిస్తే ఏమౌతుంది. వామ్మో ఇలా ఆలోచిస్తున్నాను ఏంటి అని తనలో తాను అనుకుంటుంది.
End of Article