“కృష్ణ” గారి చేతులతో రాసిన ఈ లెటర్ చూశారా..? అచ్చం ముత్యాలలాగే ఉన్నాయి కదూ..?

“కృష్ణ” గారి చేతులతో రాసిన ఈ లెటర్ చూశారా..? అచ్చం ముత్యాలలాగే ఉన్నాయి కదూ..?

by Mounika Singaluri

Ads

సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలకు మారుపేరు. టాలీవుడ్‌కు కౌబాయ్, జేమ్స్ బాండ్ చిత్రాలను పరిచయం చేసిన హీరో. తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకువెళ్లి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించి చరిత్రలో తన పేరును నిలిచిపోయేలా చేసుకున్నారు. కృష్ణ తేనే మనసులు చిత్రం తో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు. అయితే ఆ చిత్ర సమయంలో కృష్ణ తనని తాను ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటూ ఒక లేఖ రాసారు.

Video Advertisement

ఆయన స్వయంగా రాసిన ఆ లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ లేఖ లో కృష్ణ ఏం రాసారంటే..” రసిక ప్రపంచానికి నా వందనాలు నాపేరు కృష్ణ. ‘తేనె మనసులు’ చిత్రంలో పేరు బసవరాజు. సినిమాలో నటించాలన్న ఆశతో ఎన్నాళ్ల నుంచో లెఫ్ట్ రైట్ కొడుతూ కలగంటున్న నాకు ఇన్నాళ్లకు అది రంగురంగుల కలగా ఈస్ట్మన్ కలర్లో నిజమైంది. కాని దానికోసం దర్శకులు, డాన్సు డైరెక్టర్ నాచేత మూడు మాసాలబాటు అక్షరాలా డ్రిల్లు చేయించారు. తరవాత నటన నేర్పారు. డాన్సు నేర్పారు. చివరికి నావేషం ఏమిటండీ అంటే.. డ్రిల్లు మేష్టరేనన్నారు. నటన మాత్రం డ్రిల్లు లాగే రాకుండా జాగ్రత్తగా, శ్రద్ధగా చేశాననుకోండి. మీరందరూ చూసి బాగోగులు చెప్పే క్షణం కోసం ఆశతో ఆరాటంతో ఎదురు చూస్తున్నాను. ఉగాదికి నా శుభాకాంక్షలు – కృష్ణ, 27.03.65” అని రాసారు.

krishna wrote a letter to audience during his first film..

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ‘తేనెమనసులు’ సినిమా 1965 మార్చి 31న రిలీజ్ అయింది. దానికి ముందు ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కృష్ణ తనను తాను ఇలా సరికొత్తగా పరిచయం చేసుకున్నారు. ఇలాంటి వినూత్న ఆలోచనలతో కృష్ణ అందరి దృష్టినీ ఆకర్షించే వారు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం తర్వాత వచ్చిన ‘గూఢచారి 116’ సినిమా తో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఆయన 20 చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసారు.

krishna wrote a letter to audience during his first film..

కృష్ణ రోజుకి మూడు షిఫ్టుల్లో పనిచేసి ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు విడుదల చేసేవారంటే సినిమా పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి ఏంటో అర్ధమవుతుంది. అప్పట్లోనే కౌ బాయ్, జేమ్స్ బాండ్ లాంటి సినిమాలను పరిచయం చేసి ట్రెండ్ సెట్ చేశారు కృష్ణ. ఆయన చేసే ప్రతీ ప్రయోగం ఇండస్ట్రీకు ఎంతో ఉపయోగపడింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ సాంకేతికంగా అభివృద్ధి చెందటానికి కృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు.


End of Article

You may also like