“కృష్ణంరాజు- శ్యామల దేవి” ప్రేమ కథ తెలుసా..? డిప్రెషన్‌లోకి వెళ్ళినప్పుడు..?

“కృష్ణంరాజు- శ్యామల దేవి” ప్రేమ కథ తెలుసా..? డిప్రెషన్‌లోకి వెళ్ళినప్పుడు..?

by Anudeep

Ads

హీరోగా.. విలక్షణ నటుడిగా… ప్రతినాయకుడిగా మెప్పించిన కృష్ణం రాజు దాదాపు 187 చిత్రాల్లో నటించారు. అయితే కృష్ణం రాజు వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తెలుగు చిత్రపరిశ్రమలో రెబల్ స్టార్‏గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో కృష్ణంరాజు.

Video Advertisement

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన భార్య శ్యామలా దేవి.. భర్త భౌతికకాయాన్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. కృష్ణంరాజు, శ్యామలా దేవిల మధ్య కేవలం భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదు.. అంతకు మించిన అనుబంధం కూడా ఉంది.

krishnam raju and his wife realtion
కృష్ణంరాజు మొదటి భార్య సీతా దేవి 1995లో కారు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. కొన్ని నెలల పాటు నరకవేదనను అనుభవించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన ని రెండో పెళ్ళికి ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే 1996లో శ్యామలా దేవితో ఆయనకు రెండో వివాహం జరిగింది.

krishnam raju and his wife realtionkrishnam raju and his wife realtion
ఈ పెళ్లి విషయంలో కృష్ణంరాజు తనవైపునుంచే కాదు.. కాబోయే భార్య వైపు నుంచి కూడా ఆలోచించారు. శ్యామలా దేవికి ఈ పెళ్లి ఇష్టమా లేదా?.. పెద్దల బలవంతంతో పెళ్లికి ఒప్పుకుందా? అని తెలుసుకోవటానికి ఆమె దగ్గరకు మనిషిని పంపారు. ఆమెకు ఇష్టమే అని తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. శ్యామలా దేవితో పెళ్లి తర్వాత కృష్ణంరాజులో చాలా మార్పు వచ్చింది. ఆమె కృష్ణంరాజుకు అన్ని రకాలుగా తోడుగా నిలిచింది. ముఖ్యంగా మానసిక ఇబ్బందుల సమయంలో కొండంత అండగా నిలిచింది. భర్త చేసే పనుల్లో ఆమె స్వయంగా పాలు పంచుకునేది.

krishnam raju and his wife realtion
కృష్ణంరాజుకు తన తోటి నటీనటులకు ఇంటినుంచి సెట్‌కు భోజనం తీసుకెళ్లటం అలవాటు. సెట్‌లో అందరికీ భోజనం కొసరికొసరి వడ్డించేవారు. శ్యామలా దేవి స్వయంగా ఇంట్లో వంట వండి నటీనటులకు పంపేది. కష్టనష్టాల్లో తోడుంటున్న భార్యకు కృష్ణంరాజు సముచిత స్థానం ఇచ్చేవారు. ఏ కార్యక్రమానికి వెళ్లిన శ్యామలా దేవిని వెంటబెట్టుకుని వెళ్లేవారు. ఇద్దరూ ఇండస్ట్రీ ఆది దంపతులుగా అనిపించేవారు. చాలా సమయాల్లో కృష్ణంరాజు తన భార్య గురించి గొప్పగా చెప్పారు. ‘‘నా భార్యే నాకు అతి పెద్ద బహుమతి’’ అనే వారు.

krishnam raju and his wife realtion
వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. వీళ్లు మాత్రమే కాకుండా మొదటి భార్య సీతాదేవి కుమార్తె కూడా కృష్ణంరాజు వద్దే ఉంటుంది. అలాగే మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు ఈ దంపతులు.


End of Article

You may also like