కవిత గారి కౌంటర్ మాములుగా లేదుగా..! కేటీఆర్ అన్నకే పంచ్..!

కవిత గారి కౌంటర్ మాములుగా లేదుగా..! కేటీఆర్ అన్నకే పంచ్..!

by Anudeep

Ads

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిననన్..అన్నట్టుగా కరోనా కాలంలో ఒక్కొక్కరిలో ఒక్కోరకమైన టాలెంట్ బయటికి వస్తుంది. ఇళ్లలోనే ఉంటున్న మగవారు వారి వారి టాలెంట్స్ కి సాన పెడుతున్నారు.అయితే ఈ లాక్ డౌన్ కాలంలో అందరిని ఇబ్బంది పెట్టే సమస్య ఒకటుంది అదే హెయిర్ కటింగ్..మగాళ్లకే ప్రత్యేకించిన ఈ సమస్య ఇళ్లల్లోని మహిళలు ఒక కొత్త విద్యను (హెయిర్ కటింగ్) నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.  ఈ హెయిర్ కట్ సమస్యను ప్రస్తావిస్తూ కేటిఆర్ కి  ట్వీట్ చేశాడు ఒక నెటిజన్.. ఆ ట్వీట్ కి కెటిఆర్ రిప్లై… కెటిఆర్ కి ఆయన చెల్లెలు కవిత్ పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ హల్ చల్ చేస్తుంది.

Video Advertisement

నెలకోసారైనా సెలూన్ గడప తొక్కేవారికి ఈ సారి ఏకంగా రెండు నెలలయిపోయింది. దానికి తోడు అసలే సమ్మర్ ..దాంతో ఈ సమస్యను ప్రస్తావిస్తూ కెటిఆర్ కి ట్వీట్ చేశాడు ఒక నెటిజన్ ‘ఏప్రిల్ 20 తర్వాతైనా..హెయిర్ కటింగ్ తెరిచే సూచనలు ఉన్నాయా?  లేకపోతే నా భార్యే హెయిర్ కట్‌ చేస్తానని అంటోందంటూ ట్వీట్ చేశాడు. దానికి మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. ‘టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీకి ఆయన భార్య అనుష్క శర్మ హెయిర్ కట్‌ చేసింది. అలాంటిప్పుడు నీవెందుకు చేయించుకోవు’? అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు కెటిఆర్.

కెటిఆర్ ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విషయం తెలిసిందే. ఏదన్నా సమస్యుంది అని ఎవరైనా ట్వీట్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతారు.. ఎవరైనా ఏదన్నా ఫన్నీగా క్వశ్చన్ చేసినా పంచ్ వేస్తారు. అయితే ఈ ట్వీట్ స్పెషలేంటంటే కెటిఆర్ ఫన్నీ ఆన్సర్ కి, కెటిఆర్ ట్వీట్ కి  చెల్లెలు కవిత సూపర్ పంచ్ వేసింది.. ఆ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ “ అన్నయ్యా.. బాబీ(వదిన)కి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా? అని ట్వీట్ చేశారు.

అన్నా చెల్లెల్ల మధ్య సాగిన ఈ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో ఆసక్తి దాయకంగా మారి, ఫుల్ వైరలయింది.. కెటిఆర్ వారి భార్యకి అవకాశం ఇస్తారో ఇవ్వరో, కవిత పంచ్ కి ఏమని రిప్లై ఇస్తారో చూడాలి. కెటిఆర్ చెప్పారు కదా విరాటే చేయించుకున్నాడు మీరెంత అని, ఇంకేటి మరి అందరూ ప్రిపేరవ్వండి..


End of Article

You may also like