Ads
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు గట్టిగా నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ కార్ లు, బండ్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు.
Video Advertisement
సామాన్య ప్రజలు దగ్గరనుండి పెద్ద పెద్ద నాయకుల వరకు అందరి వాహనాలను చెకింగ్ ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు పడడంతో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు.
ఈ నేపథ్యంలో ఆఖరికి మంత్రి కేటీఆర్ ని కూడా పోలీసులు వదలలేదు. అందరిలాగానే ఆయన కారును కూడా ఆపి చెక్ చేశారు.
కామారెడ్డి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేటీఆర్ వెళుతుండగా మెదక్ జిల్లా తుఫ్రాన్ వద్ద కేటీఆర్ వాహనాన్ని ఆపి చెక్ చేశారు. వారికి మంత్రి కేటీఆర్ పూర్తిగా సహకరించారు. కారులో ఏమీ లభ్యం కాలేదని వాటర్ బాటిల్స్ వంటివి తప్ప ఏమీ లేవని పోలీసులు వెల్లడించారు. తనిఖీలు అనంతరం మంత్రి కేటీఆర్ కామారెడ్డి బయలుదేరి వెళ్లారు.
ఒక మంత్రి అయ్యుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులకు సహకరించినందుకు సామాన్య ప్రజలు అభినందిస్తున్నారు. పోలీసులు కూడా ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమకు సహకరించాలని కోరుతున్నారు. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు.కాగా ఈసారి ఎన్నికల్లో కేసిఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి బరిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ తమ అభ్యర్థుల తరఫున బహిరంగ సభలో ప్రచారం చేస్తుండగా, తన తండ్రి పోటీ చేస్తున్న కామారెడ్డిలో కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఈసారి కూడా తెలంగాణలో తామే అధికరణకు వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read:ఒక IAS ఆఫీసర్ అయ్యి ఉండి ఇలాంటి పని చేయడం ఏంటి..? అసలు విషయం ఏంటంటే..?
End of Article