వాట్సాప్ మెసేజ్ ని షేర్ చేసి థాంక్యూ చెప్పిన కేటీఆర్..! అందులో ఏం ఉందంటే..?

వాట్సాప్ మెసేజ్ ని షేర్ చేసి థాంక్యూ చెప్పిన కేటీఆర్..! అందులో ఏం ఉందంటే..?

by Harika

Ads

కేసీఆర్ గారి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్. జులై 24 వ, తేదీ 1976 లో కరీంనగర్ లో కేటీఆర్ పుట్టారు. యూసఫ్ గూడలో ఉన్న అమరావతి పబ్లిక్ స్కూల్లో, ఆ తర్వాత మెహిదీపట్నంలో ఉన్న నలంద పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. అబిడ్స్ రోడ్ లో ఉన్న సెంట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో చదువుకున్న తర్వాత, గుంటూరు జిల్లాలోని, వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివి, ఆ తర్వాత నిజాం కాలేజ్ లో మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ, బోటనీలో బీఎస్సీ చదువుకున్నారు.

Video Advertisement

కేటీఆర్ కి రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ పూణే నుండి మైక్రోబయాలజీలో ఎంఎస్సీ డిగ్రీ పొందారు. బార్చ్ కాలేజ్ నుండి మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్ లో ఎంబీఏ పొందారు. న్యూయార్క్ లో ఐటీ జాబ్ కూడా చేశారు. 2009 లో కేటీఆర్ తన రాజకీయ కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత నుండి రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. ఐటీ రంగం హైదరాబాద్ లో మరొక మెట్టు ఎక్కడానికి ముఖ్య కారణంగా నిలిచారు. ఐటీ హబ్ వంటివి స్థాపించి, ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు.

అయితే, కేటీఆర్ రాజకీయాల్లో ఎంత సీరియస్ గా ఉంటారో, మామూలుగా అంత సరదాగా ఉంటారు. సోషల్ మీడియాలో కేటీఆర్ చాలా యాక్టివ్ గా ఉంటారు.అయితే, సోషల్ మీడియా మాధ్యమాన్ని కూడా కేటీఆర్ రాజకీయానికి సంబంధించిన విషయాలు మాట్లాడటానికి వినియోగిస్తారు. అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాలని షేర్ చేస్తూ, లేదా ఎవరైనా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటారు. ఇవాళ కేటీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్  లో ఒక వాట్సాప్ మెసేజ్ షేర్ చేశారు. ఇందులో కేటీఆర్ కి ఒక వ్యక్తి ఒక కపుల్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోని పంపించారు.

ktr shares his whatsapp message

ఆ ఫోటో కింద, “ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లో సైతం రామన్నపై అభిమానం చాటుకున్న కాబోయే వధూవరులు. ముఖారాకే గ్రామానికి రామన్నపై అభిమానం అంతులేనిది. మే 5న గాడ్గే ధీరజ్, వైష్ణవి పెళ్లి ఉంది. నిన్న ప్రీ వెడ్డింగ్ షూట్ లో తమ అభిమాన నాయకుడి పేరును (KTR) రాసి తమ షూట్ ను ప్రారంభించారు. తమ నూతన జంటకు రామన్న ఆశీస్సులు సదా ఉంటాయని అన్నారు” అంటూ ఒక ఫోటోని షేర్ చేశారు. అందులో ఒక జంట లవ్ సింబల్ వేసి, పక్కన కేటీఆర్ పేరుని రాశారు. కేటీఆర్ దీనికి స్పందిస్తూ, “వాట్సాప్ లో వచ్చిన ఈ మెసేజ్ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ధీరజ్ గాడ్గేకి, వైష్ణవికి థాంక్స్” అని రాశారు. దాంతో పాటు తన వాట్సాప్ మెసేజ్ కూడా షేర్ చేశారు. వారి ఫోటోని కూడా పోస్ట్ చేశారు.

ALSO READ : 39 ఏళ్ళ రామ్ చరణ్ కి తల్లిగా… 37 ఏళ్ళ హీరోయిన్..! ఇదెలా సాధ్యం..?


End of Article

You may also like