39 ఏళ్ళ రామ్ చరణ్ కి తల్లిగా… 37 ఏళ్ళ హీరోయిన్..! ఇదెలా సాధ్యం..?

39 ఏళ్ళ రామ్ చరణ్ కి తల్లిగా… 37 ఏళ్ళ హీరోయిన్..! ఇదెలా సాధ్యం..?

by Harika

Ads

టాలీవుడ్ యంగ్ బ్యూటీ, నటి అంజలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. షాపింగ్ మాల్ సినిమా డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. తర్వాత గీతాంజలి, మసాలా సినిమాల ద్వారా మరింత పేరు సంపాదించుకుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత గీతాంజలి సినిమాకి సీక్వెల్ అయిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో మళ్లీ మన ముందుకి వచ్చింది. శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యింది..

Video Advertisement

ఇక గీతాంజలి తర్వాత అంజలి చేసే సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమాలో మంచి పాత్ర లభించినట్లు గతంలోనే సమాచారం అందింది. ఈ సినిమాలో ఎస్ జె సూర్య, సునీల్, జయరాం, నవీన్ చంద్ర, నాజర్, రాజీవ్ కనకాల కూడా నటిస్తున్నారు. జీనియస్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అంజలి ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఆ పాత్ర రామ్ చరణ్ కి తల్లిగా అనే విషయం ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. ఈ మూవీలో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్నారు.

ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫాదర్ రోల్ కి అంజలి జోడిగా కనబడుతుంది. అంటే మూవీలో ప్రస్తుతం రామ్ చరణ్ కి తల్లిగా కనిపించబోతుంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అభిమానులు అప్పుడే తల్లి పాత్రలు పోషించేస్తున్నావా అంటూ తెగ ఫీల్ అవుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


End of Article

You may also like