హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించిన మంత్రి కేటీఆర్…మీలాంటి నాయకుడు మాకుంటే బాగుండని ఆ రాష్ట్ర టూరిస్ట్ కామెంట్స్.!

హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించిన మంత్రి కేటీఆర్…మీలాంటి నాయకుడు మాకుంటే బాగుండని ఆ రాష్ట్ర టూరిస్ట్ కామెంట్స్.!

by Mounika Singaluri

Ads

తెలంగాణలో ఎన్నికల హడావిడి నేపథ్యంలో మంత్రి కేటీఆర్ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకపక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ లు, మరోపక్క వివిధ ప్రతినిధుల భేటీలతో అటు ఇటు తిరుగుతున్నారు. అయితే శుక్రవారం కాసేపు మెట్రో రైలులో ప్రయాణించి సందడి చేశారు. హెచ్‌ఐసీసీలో జరిగిన రియల్‌ ఎస్టేట్‌ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. అనంతరం రాయదుర్గం నుంచి బేగంపేట వరకు మెట్రోలో ప్రయాణించారు.

Video Advertisement

తన 20 నిమిషాల ప్రయాణంలో వివిధ వర్గాల ప్రయాణికులతో ముచ్చటించారు.కేటీఆర్ మెట్రో రైల్లో ప్రయాణించేసరికి ప్రయాణికులు ఉద్యోగులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మెట్రో రైల్లో సౌకర్యాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమేమి అభివృద్ధి చేయాలంటూ అడిగారు.

అలాగే త్వరలో 450 కిలోమీటర్ల పైనే మెట్రో విస్తరణ ఉంటుందని తెలియజేశారు. అలాగే మెట్రో రైల్ లో పనిచేసే స్టాఫ్ తో మాట్లాడారు, ఎంత ఘనంగా పనిచేస్తున్నారు అంటూ అడిగి తెలుసుకున్నారు. చాలామంది సీనియర్ సిటిజన్ లు అయితే కేటీఆర్ ను చూసి సంబరపడిపోయారు. తమ పక్కన కేటీఆర్ ఉండేసరికి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.వైద్య విద్య కోసం శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినితో పాటు, ఎంబీబీఎస్‌ చదువుతున్న మరో విద్యార్థి మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. జర్మనీలో బయోటెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న మరో ప్రయాణికుడు కేటీఆర్‌తో సెల్ఫీ దిగి మురిసిపోయారు.

కేరళకు చెందిన ఓ టూరిస్ట్‌ హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ చాలా గొప్పగా ఉందని కితాబిచ్చారు. నూతనంగా నిర్మించిన అనేక కట్టడాలు, రోడ్లు, ఫ్లైఓవర్లు గొప్పగా ఉన్నాయని అన్నారు. ‘తెలంగాణకు కిటెక్స్‌ పరిశ్రమ వచ్చినప్పుడు మా రాష్ట్రంలో మీ గురించి చర్చ జరిగింద’ని చెప్పారు. మీలాంటి నాయకుడు మాకుంటే బాగుండని అనుకున్నామని తెలిపారు. నవంబర్‌ 30న ఎన్నికల్లో కచ్చితంగా అందరూ ఓటేయ్యాలని మంత్రి కేటీఆర్‌ ప్రయాణికులకు సూచించారు. పలువురైతే కేటీఆర్ పనితీరు పైన ప్రశంసలు కురిపించారు.

Also Read:అసలు హరోల్డ్ దాస్ కి లియో మీద ఎందుకు అంత కోపం…? డిలీట్ చేసిన సీన్ లో ఏం కారణం చెప్పారంటే..?


End of Article

You may also like