పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన కుక్క..! నేను తప్పిపోయాను…మా యజమాని దగ్గర చేర్చండి! (వీడియో)

పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన కుక్క..! నేను తప్పిపోయాను…మా యజమాని దగ్గర చేర్చండి! (వీడియో)

by Anudeep

ఓ కుక్క పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మీరు చదివింది నిజమే .  నేను తప్పిపోయాను నన్ను నా యజమాని దగ్గరకు చేర్చండి అంటూ పోలీసులకు వేడుకుంది.  కుక్కేంటీ? పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయటమేంటి?అదేమన్నా మాట్లాడుతుందా? చదువుతున్నాం కదా అని ఏది పడితే అది రాసేయకండి . నిజమండీ కుక్క మాట్లాడలేదు , మేం కూడా ఒప్పుకుంటాం . కానీ పూర్తిగా చదివాక వావ్ అంటూ మీరు కూడా ఆశ్చర్యపోతారు. అసలింతకీ ఏం జరిగిందో తెలుసా?

Video Advertisement

అమెరికాలో టెక్సస్‌ లోని ఓ పోలీస్ స్టేషన్ కి అర్థరాత్రి ఓ జర్మన్ షెపర్డ్ కుక్క వచ్చింది. రయ్ మంటూ స్టేషన్ లోకి దూసుకొచ్చిన కుక్కను చూసిన పోలీసులు ,బయటికి గెంటేయడానికి ప్రయత్నించారు. కానీ అది అక్కడనుండి కదలకుండా పోలీసుల వైపు చూస్తూ ఏవేవో సైగలు చేసింది. అలా చాలాసేపు చేసింది. ఆ సైగలకు అర్థం ఏమిటో మొదట వారికి ఏమాత్రం అర్థం కాలేదు . కానీ కుక్క ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుందని మాత్రం అర్దమైంది. ఆ సైగలను అర్దం చేస్కోవడానికి ప్రయత్నించారు, చివరకు అర్దం చేసుకున్నాక ఆశ్చర్యపోయారు .

ఫైనల్ గా ఆ సైగల్ సారాంశం ఏంటంటే “తాను తప్పిపోయాను.. తనకు దారి తెలియడం లేదు, యజమానికి తనను అప్పగించండి, ప్లీజ్” అని. ఇదంతా పోలీసులకు అర్దం అయ్యేలా చెప్పగలిగింది . అది అర్థం చేసుకున్న పోలీసులు కుక్క ప్రవర్తనకు ఫిదా అయిపోయారు. రాత్రంతా దానిని తమ దగ్గరే ఉంచుకుని దానితో ఆడుకున్నారు. కుక్క కూడా పోలీసులను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్లతో కలిసిపోయింది.

కుక్కలు చాలా తెలివిగలవి..అందులోని జర్మన్ షెపర్డ్ జాతి కుక్కలకు  తెలివి కాస్త ఎక్కువే. కుక్క తెలివికి ఫిదా అయిన పోలీసులు దానిని ఎలాగైనా  యజమాని దగ్గరకి చేర్చాలనుకున్నారు . కానీ కుక్క మెడలో ఎలాంటి ట్యాగ్ లేకపోవడంతో పోలీసులకు కష్టం అనిపించింది. అప్పుడు ఇక్కడ నేనున్నానంటూ వారికి గుర్తొచ్చింది అదేనండీ “సోషల్ మీడియా” . కుక్కను ఫొటొలు తీశారు, పోస్టు చేశారు . ఈ విషయం కాస్తా వైరలై, చివరికి యజమాని వరకు వెళ్లింది.

రాత్రి నిద్రపోయినప్పుడు కుక్క బయటకు వెళ్లిపోయిందనీ , దారితప్పి పోయినప్పటికి పోలీసులని ఆశ్రయించడం ఆశ్చర్యంగా ఉందని, తన కుక్క తెలివికి మురిసిపోయాడు ఆ యజమాని . ఇంత మందిని ఆశ్చర్యపరిచి, అందరిని ఫిదా చేసిన ఆ కుక్క పేరు “చికో”.


You may also like

Leave a Comment