Ads
“పిల్లికి చెలగాటం – ఎలుకకి ప్రాణసంకటం” అంటే ఇదేనేమో . అద్దెకిచ్చిన ఇంటికి రెంటు ఇవ్వలేదని ఒకవైపు ఇంటి ఓనర్ లబోదిబోమంటుంటే , ప్రభుత్వంతో మాట్లాడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటని స్టూడెంట్స్ , సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు . అద్దెకట్ట లేదని హాస్టల్ విద్యార్ధులని లోపలే ఉంచి తాళం వేసుకుని పోయాడు ఇంటి ఓనర్. కర్నూల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.
Video Advertisement
కర్నూల్ జిల్లా ఆత్మకూరులో డిగ్రీ , ఇంటర్ చదువుతున్న విద్యార్దినులు 150మంది వరకు ఉన్నారు. వీరిలో కొంతమందిని బిసి హాస్టల్లో, మరికొందరిని ప్రైవేట్ బిల్డింగ్ అద్దెకి తీసుకుని వసతి కల్పించారు . హాస్టల్ భవనంలో విద్యార్ధినులు ఎదుర్కోని సమస్యలంటూ లేవు, వాటర్ ప్రాబ్లం, బాత్రూం ఫెసిలిటీ సరిగా లేదు. గాలి , వెలుతురు శూన్యం . కనీసం హాస్టల్లోపలికి వెళ్లే దారైనా బాగుంటుందా అంటే అది కూడా ఇరుకే. మెయిన్ రోడ్డు మీద ఉండడంతో అమ్మాయిలకు ప్రతిది ఇబ్బందిగానే తోచింది. దాంతో విద్యార్ధినులని మరో భవనానికి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నారు.
వార్డెన్ సూచన మేరకు మరో భవనంలోకి మారడానికి సిద్దమయ్యారు విద్యార్ధినులు. హఠాత్తుగా అక్కడికి వచ్చిన భవన యజమాని , అద్దె డబ్బులు చెల్లించే వరకు ఎక్కడికి వెళ్లేది లేదని బెదిరించాడు. అంతేకాదు తనకి రావలసిన ఆరు నెలల బకాయిలు వచ్చిన తర్వాతనే మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్లనిస్తాను అంటూ విద్యార్ధినులను, సిబ్బందిని లోపల పెట్టి తాళం వేసాడు.
ఓనర్ నిర్వాకానికి భయపడిన స్టూడెంట్స్ వార్డెన్ కి కాల్ చేసి చెప్పగా, హుటాహుటిన అక్కడికి వచ్చిన వార్డెన్ షాహినూరా ,ఏదైనా ఉంటే ప్రభుత్వంతో తేల్చుకోమని , స్టూడెంట్స్ ని నిర్బందించడం ఎంత వరక కరెక్ట్ . బిల్డింగ్లో లేని సమస్యంటూ లేదని సమస్యలన్ని మీడియా ముఖంగా ఏకరువు పెట్టారు. అంతేకాదు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు.పోలీసులు వచ్చి ఓనర్ తో మాట్లాడి ఒప్పించి తాళం తీయించారు.
ప్రభుత్వం సరైన సమయానికి బిల్లులు రిలీజ్ చేయకపోవడంతో అటు అద్దె ఇచ్చిన వారికి సమస్య , ఉంటున్న స్టూడెంట్స్ కి సమస్యే. కేవలం ఆత్మకూరులోనే కాదు రాష్ట్రంలోని చాలా హాస్టల్స్ ప్రైవేట్ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆ భవనాల్లో అన్ని అరకొర వసతులతో విద్యార్దులు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎన్ని రకాల కంప్లైంట్లు వచ్చినా ప్రభుత్వాధికారుల నుండి స్పందన మాత్రం ఉండదు అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ.
watch video:
End of Article