నిరంతరం మనిషి ఏదో సాధించాలని తన జీవిత పయనం మరింత సౌకర్యవంతంగా అభివృద్ధిపథంలో సాగాలని ఆశిస్తూ ఉంటాడు వాటి కోసం ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల నుండి బయట ఉపయోగించే వాహనాలు వరకు ఎన్నింటినో కనుగొనడం జరిగింది. వీటి వల్ల మనిషికి ఎన్ని రకాలుగా అయితే ఉపయోగాలున్నాయో అన్ని రకాలుగా నష్టాన్ని కూడా చూడాల్సి వస్తుంది. మనిషి చేస్తున్న అనాలోచితం గా చేస్తున్న కొన్ని వస్తువుల ఉపయోగం వల్ల ప్రకృతి కాలుష్యానికి గురి అవుతుంది. శబ్ద కాలుష్యం కూడా వీటిలో ఒకటి. అనవసరంగా పెద్ద పెద్ద సౌండ్ తో స్పీకర్ లను పెట్టడం, ట్రైన్స్, ఏరోప్లేన్, జెట్స్ వంటి వాటి నుంచి వచ్చే శబ్దాలు, సముద్రంలో భారీ నౌకల నుంచి వచ్చే శబ్దాలు రోడ్డుపై వాహనాల నుంచి వచ్చే శబ్దాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే శబ్దాల వలన శబ్దకాలుష్యం అనేది ఏర్పడుతుంది.

ఈ శబ్ద కాలుష్యం వల్ల మానవుల్లో వినికిడి శక్తిలో లోపం, అధికమైన మానసిక వత్తిళ్లు, తలనొప్పి, అసహనం, నిద్ర లేమి సమస్యలే కాకుండా ఇతర జీవరాశుల్లో కూడా సమస్యలకు కారణం అవుతుంది. ఈ విషయాలపై అవగాహన కల్పించడం కోసం కర్నూలులోని పోలీసు వారు కర్నూలు పరిధిలో తనిఖీలు చేసి అధికంగా శబ్దాన్ని చేసే వాహనాలు యొక్క సైలెన్సర్స్ అన్ని పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చి, స్టేషన్ ముందు ఉన్న రోడ్డు రోల్లర్ తో వాటన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. మనిషి మనుగడ ఇంకొన్ని తరాల వరకు సవ్యంగా తాగాలి అంటే ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది ఈ విషయంపై అవగాహన కల్పించడం కోసం పోలీసు వారు చేసిన పని అభినందనీయం.