Kurup Movie Review : కురుప్ తో “దుల్కర్ సల్మాన్” పాన్ ఇండియన్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Kurup Movie Review : కురుప్ తో “దుల్కర్ సల్మాన్” పాన్ ఇండియన్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : కురుప్
  • నటీనటులు : దుల్కర్ సల్మాన్, శోభితా ధూళిపాళ, ఇంద్రజిత్ సుకుమారన్.
  • నిర్మాత : దుల్కర్ సల్మాన్
  • దర్శకత్వం : శ్రీనాథ్ రాజేంద్రన్
  • సంగీతం : సుశీన్ శ్యామ్
  • విడుదల తేదీ : నవంబర్ 12, 2021

kurup movie review

Video Advertisement

స్టోరీ :

సినిమా 1960, 70, నుండి నడుస్తూ 2000 సంవత్సరం వరకు జరిగిన సంఘటనలను చూపిస్తుంది. గోపి కృష్ణ కురుప్ అలియాస్ సుకుమార కురుప్ (దుల్కర్ సల్మాన్) కి జీవితంలో ఏదో చేయాలని ఉంటుంది. సాధారణ జీవితం గడపడం తనకి ఇష్టం ఉండదు. ఈ క్రమంలో కురుప్ ఆర్మీ నుండి పారిపోతాడు. అక్కడి నుండి కురుప్ ఎలాంటి పనులు చేసాడు? అంత డబ్బున్న వాడిగా ఎలా మారాడు? మధ్యలో కురుప్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? పోలీసులు కురుప్ కోసం ఎందుకు గాలిస్తున్నారు? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

kurup movie review

రివ్యూ :

ఇది దుల్కర్ సల్మాన్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమా షూటింగ్ పూర్తయ్యి దాదాపు సంవత్సరం అయ్యింది. మధ్యలో ఉన్న పరిస్థితుల కారణంగా విడుదల ఆలస్యం అయ్యింది. మధ్యలో సినిమా థియేటర్లలో విడుదల అవ్వదు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ సినిమా బృందం మాత్రం సినిమా థియేటర్లలోనే విడుదల చేయాలి అని ఓపికగా ఎదురు చూసి, ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. కురుప్ సినిమాకి అతి పెద్ద హైలైట్ హీరో, నిర్మాత అయిన దుల్కర్ సల్మాన్.

kurup movie review

సినిమాని కేవలం ఇతర భాషల్లోకి డబ్ చేయడం మాత్రమే కాకుండా, మలయాళంతో పాటు, తెలుగు, తమిళ్ లో కూడా తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. దాంతో పాత్ర ఇంకా ఒరిజినల్ గా కనిపించింది. అలాగే హీరోయిన్ గా నటించిన శోభితా ధూళిపాళ, ఒక ముఖ్య పాత్రలో నటించిన ఇంద్రజిత్ కూడా తమ పరిధి వరకు బాగా నటించారు. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. కానీ డైరెక్టర్ శ్రీనాథ్ స్టోరీ ఇంకా బాగా చూపించి ఉండొచ్చు అనిపిస్తుంది. కొన్నిచోట్ల హడావిడి పడ్డారు ఏమో అనిపిస్తుంది. ఇంకా చాలా విషయాలు తెరపై చూపించి ఉండొచ్చు అనే అభిప్రాయం ప్రేక్షకులకి కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్ :

  • దుల్కర్ సల్మాన్
  • సాంకేతిక విలువలు
  • సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్:

  • కథకి ముఖ్యమైన కొన్ని అంశాలని తెరపై చూపించకపోవడం

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

క్రైమ్ సినిమాలు చూసి చాలా రోజులు అయ్యింది. ఒక డార్క్ క్రైమ్ డ్రామా చూద్దాం అనుకునేవారు ఆలోచించకుండా కురుప్ సినిమా చూసేయొచ్చు. మొదటిసారి సినిమా చూసిన ప్రేక్షకుడిని అయితే తప్పకుండా నిరాశపరచదు.


End of Article

You may also like