కూతురికి కరోనా సోకకూడదని అని డాక్టర్ చేసిన గొప్ప ప్రయత్నమిది.

కూతురికి కరోనా సోకకూడదని అని డాక్టర్ చేసిన గొప్ప ప్రయత్నమిది.

by Megha Varna

Ads

కూతురికి కరోనా సోకకూడదని తన కూతురిని ఎలా అయిన క్వారంటైన్ లో ఉంచేందుకు తండ్రి చేసిన గొప్ప ప్రయత్నమిది,రాజస్థాన్ లోని కోటాలో చదువుకుంటున్న తన కూతురి కోసం నిరంతరంగా 50 గంటలు,5 రాష్ట్రాలు ప్రయాణించి 2వేల 500 కిలోమీటర్ల  దూరంలో ఉండే తన కూతురి దగ్గరికి చేరుకున్నాడు,ఆ డాక్టర్ మార్గ మధ్యలో జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ప్రయాణం చేసాడు, బోర్డర్ చెక్ పాయింట్ల వద్ద కొందరు పోలీసులు మాస్క్ లేక పోవడం చూసి ఆ డాక్టర్ తన దగ్గర ఉన్నా మాస్క్ లు, శానిటైజర్లు ఇచ్చి జాగ్రత్తలు చేప్పి రాజస్థాన్ లోని కోటాలో కి చేరుకున్నాడు.

Video Advertisement

Also check: హైదరాబాద్ ఐసోలేషన్ వార్డ్ లో బాధితురాలి పరిస్థి ఇది…వైరల్ వీడియో..!

కూతురి దగ్గరికి చేరుకొని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా జార్ఖండ్‌ కి తిరిగి పయనం అయ్యాడు ఆ తండ్రి,మార్గ మధ్యలో తండ్రి తెచ్చిన ఆహార పదార్థాలు తిన్నాను అని ,మా నాన్న నా కోసం ఇంత దూరం ప్రయాణం చేసాడు,నేను చాలా లక్కీ అని,ఈ సంఘటన నా జీవితంలో మరిచిపోలేను అంటూ తన అనుభవాలను పంచుకుంది,మా నాన్న నన్ను ఇంటి దగ్గర చేర్చి తిరిగి విధుల్లో చేరాడు అని కూతురు సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది,డాక్టర్ గా తన బాధ్యతను,కూతురి మీద ప్రేమను చూపించిన ఆ డాక్టర్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు,హ్యాట్సాప్ డాక్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Must read: డాక్టర్ సుమతో తన కూతురి మాటలు ఇవి..!

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులు , ఆకస్మిక మరణాలతో ఏమి చెయ్యాలో తెలియక తీవ్రంగా సతమతమవుతున్నాయి. భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. కరోనా వైరస్ తన ఉగ్రరూపాన్ని దాల్చేవేళ ప్రధాని మోడీ 21 రోజుల కంప్లీట్ లాక్ డౌన్ ని ప్రకటించారు. మోడీ సంపూర్ణ లాక్ డౌన్ ని ప్రకటించాక ముందే దేశంలో చాలా రాష్ట్రాలు కంప్లీట్ లాక్ డౌన్ ని ప్రకటించేసాయి . కాబట్టి అందరు ప్రబుత్వంకి సహకరిస్తే ఈ మహమ్మారినుండి బయటపడచ్చు.


End of Article

You may also like