Ads
ఈ లేడీ సింగం తన జీవితంలోకి రాబోయే వ్యక్తిని మంచివాడని నమ్మింది. అతనితో జీవితం పంచుకోవాలని కలలు కనింది. పెద్దల సమక్షంలో వీరిద్దరికి నిశ్చితార్ధం కూడా జరిగింది. అంతలోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అతని గురించి ఊహించని విషయాలు తెలియడంతో పోలీస్ ఆఫీసర్ గా ఈ అమ్మాయి తన బాధ్యతని నిర్వర్తించింది.
Video Advertisement
ఓ వైపు నిరుద్యోగం పెరుగుతున్న భారత దేశంలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆశ పెట్టి వారి వద్ద నుంచి డబ్బు తీసుకుని మోసం చేసే వారు కూడా ఎక్కువ మందే ఉంటున్నారు.
అయితే చాలా మంది నిరుద్యోగులు ఇటువంటి కేటుగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్నారు. రైల్వే, పోలిసుల శాఖలలో తమకు తెలిసిన వారు ఉన్నారంటూ చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బు గుంజి.. ఆ తరువాత వారిని మోసం చేసి వదిలేస్తున్నారు. అస్సాం కు చెందిన రాణా పోగాగ్ అనే వ్యక్తి కూడా ఇదే బాపతుకు చెందిన వ్యక్తి. ఇతను పబ్లిక్ రిలేషన్ అధికారినంటూ అక్కడి అధికారులతో, స్థానికులతో పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి మజులి జిల్లాకు చెందిన జున్మోని రాభాతో పరిచయం ఏర్పడి ప్రేమకి దారితీసింది.
వీరి పెద్దలు కూడా వీరికి అంగీకారం తెలపడంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ లో వీరు వివాహం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కొందరు రాణా గురించి జున్మోని రాభాకు ఫిర్యాదు చేయడంతో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాణా ఓ వ్యక్తితో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లో తనకు తెలిసిన వారు ఉన్నారని, ఉద్యోగం ఇప్పిస్తానని కోట్ల రూపాయలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఫేక్ ఆఫర్ లెటర్ ను ఇవ్వడం వలన తాను మోసపోయానని చెప్పుకొచ్చాడని కాబోయే భర్త ఆగడాలు తెలుసుకున్న జున్మోని ఫిర్యాదు తీసుకుని అరెస్ట్ చేసారు.
End of Article