Ads
చాలామందికి ల్యాండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ పై ఎన్నో సందేహాలు ఉంటాయి. మీకు కూడా ల్యాండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వాటి కోసం ఇక్కడ ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
Video Advertisement
దీంతో మీరు మీ సందేహాలని క్లియర్ చేసుకోవచ్చు. అయితే ప్లాట్లు వంటివి ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ జరగాలి వంటి మొదలైన విషయాల గురించి చూద్దాం. రియల్ ఎస్టేట్ లో చాలా ప్లాట్లు కలిపి అమ్ముతూ ఉంటారు. సుమారు 200 ఫ్లాట్లు పైగా ఉంటూ ఉంటాయి.
ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక ప్లాట్ కొనాలంటే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూడడం జరుగుతుంది. కొన్ని సార్లు ఒకే ప్లాట్ ని ఇద్దరి ముగ్గురికి అమ్ముతూ వుంటారు. అందుకని జాగ్రత్తగా వీటిని గమనించాలి. కొనేముందు టైటిల్ చూసుకోవడం వల్ల ఎన్నో విషయాలు క్లారిటీగా తెలుస్తాయి. మొదటగా ప్లాట్లు సక్రమంగా డివిజన్ జరిగాయా లేదా అనేది చూడాలి.
అప్రూవ్డ్ లేఔట్ అనేది రెండవది. అప్రూవ్డ్ లేఔట్ అంటే గ్రామపంచాయతీ ఉంటుంది. మున్సిపల్ ఏరియా ఉంటుంది. కార్పొరేట్ ఏరియా ఉంటుంది. అయితే ఏరియాని బట్టి అథారిటీ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ల దగ్గర అప్రూవ్డ్ ప్లాన్ తీసుకోవాలి. ఈ ప్లాన్ తీసుకున్నాక ప్లాట్ అమ్మబోయే వ్యక్తికి టైటిల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఈ ప్రాపర్టీ అతనికి ఎలా వచ్చింది అనేది చూసుకోవడం చాలా ముఖ్యం.
30 సంవత్సరాలు టైటిల్ మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలన్నా లోన్ తీసుకోవాలని అనుకుంటే బ్యాంకర్స్ ముప్పై ఏళ్ళ టైటిల్ ని చూస్తారు. అందుకనే ముందే అన్ని చూసి ఆ తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి. అదే ఒకవేళ వ్యవసాయ భూమిని ప్లాట్స్ కింద అమ్మినప్పుడు కొనుగోలు చేస్తే పట్టాదారులకి సంబంధించి వివరాలను చూసుకోవాలి.
మ్యుటేషన్ జరిగిందా లేదా ఆర్ఓఆర్ యాక్ట్ కింద మ్యుటేషన్ జరిగిందా లేదా అనేది చూసుకోవాలి. అలానే మ్యుటేషన్ జరిగిన తర్వాత పట్టాదారు పాస్ బుక్ టైటిల్ ఇష్యూ చేసారా అనేది చూడాలి. ఆ తర్వాత పట్టాదారులు రియల్ ఎస్టేట్ వాళ్లకి ఎలా సేల్ చేశారు అనేది కూడా చెక్ చేసుకోవాలి.
ఆ తర్వాత లే అవుట్ కి అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఆ లేఅవుట్ వచ్చిన తర్వాత మాత్రమే రియల్ ఎస్టేట్ వాళ్ళు థర్డ్ పార్టీస్ కి అమ్మడానికి అవుతుంది. ఇప్పుడు మోసాలు ఎక్కువగా జరిగిపోతున్నాయి కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఉన్న డబ్బులు పెట్టి ఇటువంటివి కొనుగోలు చేస్తే ఆ తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే బాగా సఫర్ అవ్వాల్సింది వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఆ ప్రాపర్టీ అమ్మరా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. మీరు దేనినైనా కొనే ముందు ఒక అడ్వకేట్ ని సంప్రదించి ఆ తర్వాత మాత్రమే ప్లాట్స్ కొనుక్కోవడం మంచిది.
End of Article