1999 లో చనిపోయిన వ్యక్తి 2021 లో తన భూమిని వేరేవారికి రిజిస్ట్రేషన్ చేశాడు. నమ్మశక్యంగా లేదు కదూ. అతడికి ఆధార్ కార్డు కూడా ఉంది. కామారెడ్డి గాంధీనగర్ లో ఈ ఘటన జరిగింది. ఎప్పుడో చనిపోయిన లక్ష్మణ్ రావు పేరిట నకిలీ ఆధార్ సృష్టించి భూమి కాజేశారు. చనిపోయిన వ్య‌క్తి యేడాది క్రితం త‌న భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా కుటుంబ సభ్యులకు తెలియడంతో షాక్ అయ్యారు.

Video Advertisement

 

 

వివరాల్లోకి వెళ్తే..కామారెడ్డి జిల్లాకు చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి 1984 సంవత్సరంలో గాంధీనగర్‌లోని 213 గజాల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆ స్థలానికి కంచి వేసి ఉంచారు. లక్ష్మణ రావు 1999 లో మరణించారు. అప్పటి నుంచి ఆయన మనవడు చైతన్య ఆ స్థలాన్ని చూసుకుంటున్నారు. అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించి వెళ్లేవారు. అదే విధంగా గతేడాది నవంబర్ లో కూడా చైతన్య ఆ స్థలాన్ని చూడటానికి రాగా..చుట్టుపక్కల వారు మీరు మీ స్థలాన్ని అమ్మేసారట కదా అని చెప్పడంతో ఖంగుతిన్నారు చైతన్య.

land registration done by dead person's name..!!

చైతన్య వెంటనే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి ఎవరి పేరున‌ స్థలం ఉన్నది.. ఎవరి పేరుపై క్రయ విక్రయాలు జరిగాయని ఆరా తీశాడు. అధికారాలు ఇచ్చిన పత్రాలను పరిశీలించగా విస్తు పోయే నిజాలు వెలుగు చూశాయి. 1999లో మృతి చెందిన లక్ష్మణరావు 2021 జూన్‌లో భూమిని విక్రయించినట్లు ఆ పత్రాల్లో ఉంది. లక్ష్మణరావు చనిపోయే నాటికి ఇంకా ఆధార్ కార్డులు అందుబాటులో లేకున్నా నకిలీ ఆధార్ కార్డును సృష్టించారు. అందులోని ఫోటో కూడా సక్రమంగా కనిపించడం లేదు. తమ భూమిని కబ్జా చేశారని మనవడు చైతన్య, కోడలు సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

land registration done by dead person's name..!!

తన భూమి తనకు ఇప్పించాలని మనవడు చైతన్య వేడుకుంటున్నాడు. ఇలాంటి భూకజ్బాలను అరికట్టే విధంగా మున్సిప‌ల్‌శాఖ మంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాల‌ని కోరుతున్నాడు చైతన్య. తమ లాంటి వాళ్లకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక మధ్య, పేద వాళ్ల సంగతేంటని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. నిజంగా మా తాతయ్యే అమ్మినట్లైతే ఆయన్ని తీసుకురమ్మని కోరుతున్నాడు. లేదంటే ఈ దొంగ రిజిస్టేష‌న్ చేసుకున్న వారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

 

watch video: