టి ఎన్ ఆర్ గారు చివరగా చెప్పిన ఈ మాటలు వింటే కంటతడి పెడతారు.. జాగ్రత్త గా ఉండండి..!

టి ఎన్ ఆర్ గారు చివరగా చెప్పిన ఈ మాటలు వింటే కంటతడి పెడతారు.. జాగ్రత్త గా ఉండండి..!

by Anudeep

Ads

కరోనా మహమ్మారి ఎందరో ప్రముఖుల్ని బలి తీసుకుంది. తమ అభిమాన నటులు, గాయకులూ ఈ కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా.. టి ఎన్ ఆర్ గారు మరణ వార్త తెలుగు వారిని శోకసంద్రం లో ముంచేసింది. ఆయన మరణించారన్న వార్తను తెలుగు వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

Video Advertisement

tnr 2

ఆయన ఆఖరు గా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అందరు జాగ్రత్త గా ఉండాలంటూ ఆయన హితవు చెప్పారు.ఆ వీడియో ను చూస్తుంటే అభిమానులు కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు.. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ..” హాయ్ అండి.. నేను ప్రభుత్వం ఇచ్చిన స్టే హోమ్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా. ఓ వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో నే ఉంటున్నా.. ఈ టైం లో మీరందరు కూడా జాగ్రత్త గా ఉండాలి.

tnr 1

నేను కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. నాకు ఇష్టమైన బుక్స్ చదువుతున్నా.. పాటలు వింటున్నా.. ప్రాణాయామం.. యోగాసనాలు వంటివి వేస్తున్నా.. పిల్లల చేత కూడా ఈ పనులు చేయిస్తున్నా.. ఇమ్మ్యూనిటి ని పెంచుకునే దిశగా అడుగులు వేయండి.. రీసెంట్ గా నేను కొంతమందికి ఫోన్ చేశా.. అయితే.. వారిలో చాలా మంది కరోనా గురించి ఇంటి పెద్దలే భయపడుతున్నారు.. అలా పానిక్ అయితే ఎలా అండి..? ఇంటి పెద్దలే పానిక్ అయితే ఇంట్లో వారి పరిస్థితి ఎలా ఉంటుంది..?

tnr 3

భయపడకండి.. ఈ పరిస్థితుల్ని ధైర్యం గా ఎదుర్కోవాలి. మీరు పానిక్ ఐతే మీ ఇమ్మ్యూనిటి లెవెల్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.. కాబట్టి మీరు ధైర్యం గా ఉండి మీ ఇంట్లో వాళ్ళని కూడా ధైర్యం గా ఉంచండి. మీ పిల్లలకు బోల్డెన్ని విషయాలు నేర్పించండి. పిల్లలతో ఎక్కువ సమయం గడపండి ” అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఈ స్టే హోమ్ ఛాలెంజ్ ను మరో ఐదుగురికి ఇచ్చారు. మీరు ఆయన మాటలను ఈ కింద వీడియో లో చూడవచ్చు.

Watch Video:


End of Article

You may also like