Home Filmy Adda SSMB 28 గ్లింప్స్ ఆ 2 స్టార్ హీరోల సినిమాలతో పాటు రానుందా..?

SSMB 28 గ్లింప్స్ ఆ 2 స్టార్ హీరోల సినిమాలతో పాటు రానుందా..?

by Anudeep

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయి చాలా కాలం అయినా కూడా ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైమ్ పట్టింది.

 

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకి సంబంధిన గ్లింప్స్ ని సంక్రాంతి సందర్భంగా రానున్న బాలయ్య చిత్రం ‘వీర సింహ రెడ్డి’. విజయ్ ‘వారసుడు’ చిత్రాలతో కలిపి విడుదల చేయనున్నట్లు సమాచారం.

 latest news about SSMB 28 glimpse..

అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డే షూటింగ్ కు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ వీడియోలో త్రివిక్రమ్, మహేష్ బాబు సెట్స్ కు రావడం.. ఇంకా మేకర్స్ కూడా సెట్స్ లో ఉండటం చూపించారు. అంతే కాకుండా సెట్స్‌లో మహేష్ బాబుతో త్రివిక్రమ్ మాట్లాడుతున్న పిక్‌ను రిలీజ్ చేశారు.

 latest news about SSMB 28 glimpse..

ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

You may also like