లావణ్య తన భార్య అన్నందుకు అతనికి ఏ శిక్ష పడొచ్చు? కంప్లైంట్ ఏ దశలో ఉంది!

లావణ్య తన భార్య అన్నందుకు అతనికి ఏ శిక్ష పడొచ్చు? కంప్లైంట్ ఏ దశలో ఉంది!

by Anudeep

Ads

మహేశ్ బాబు అడిగాడని వన్ నేనొక్కడినే మూవీ ఇచ్చేసా, లేదంటే అందులో నేనే హీరో . యాంకర్ ప్రదీపై పై కామెంట్స్ స్టార్ట్ చేస్తే మహేశ్, రవితేజ, తమన్నా , లావణ్య త్రిపాఠి ఇలా వరుసగా అందరిపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరలయ్యాడు. ఎవరో గుర్తొచ్చింది కదా శ్రీరామోజు సునిశిత్.  తను చేసే కామెంట్స్ లో నిజం లేదనేది అందరికి తెలుసు కాని ఆ కామెంట్స్ కి ఇర్రిటేట్ అయిన లావణ్య నేరుగా సైబర్ క్రైం పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది .

Video Advertisement

హమ్మయ్య మొత్తానికి కనీసం లావణ్య అయినా వాడి తిక్క కుదిర్చింది. ఇప్పుడు అంతా పోలీసులే చూస్కుంటారు అని నెటిజన్లు కొంచెం అనుకున్నారు. ఇంతకీ లావణ్య ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? దాని వల్ల సునిశిత్ కి పడే శిక్ష ఏంటి? ఈ మొత్తం సీన్లో పోలీసులు ఏం చేయగలరు. తెలుసా.?

లావణ్య నేను 2015 లోనే పెళ్లి చేసుకున్నాం , వాళ్లింట్లో కూడా తెలుసు . ఇద్దరం కలిసి తిరిగేవాళ్లం . తనే నేరుగా మా ఇంటికి వచ్చేది తర్వాత విడిపోయాం ఇవి సునిశిత్ కామెంట్స్. ఆ కామెంట్స్ లో నిజం లేదని, దాని వల్ల తనకు చాలా డిస్టర్బింగ్ గా ఉందని, ఎలా అయినా యాక్షణ్ తీసుకోవాలని లావణ్య కేస్ ఫైల్ చేసింది.ముందుగా యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ ని తీయించేలా యాక్షన్ తీసుకుంటారు .

సెక్షన్ 509,సెక్షన్ 67 ఐపిసి ప్రకారం యాక్షన్ తీసుకుంటామంటున్నారు పోలీసులు . ఈ లెక్కన సునిశిత్ కామెంట్లలో నిజం లేదని తేలితే సుమారు మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సునిశిత్ చేసే కామెంట్స్లో నిజం లేదని అందరికి తెలిసిన విషయమే . కాని ఇప్పుడు కేస్ వరకు వచ్చింది కాబట్టి విచారణ అనేది ఉంటుంది. తర్వాతే శిక్ష అమలు జరుగుతుంది.కాని ఈ శిక్ష పడేవరకు లావణ్య ఫైట్ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్క్.

ఎందుకంటే మన ఇండియాలో చట్టాలు, కోర్టుల పనితీరు ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే . ఒక కేసు పెడితే ప్రూవ్ అయి శిక్షపడడానికి కొన్నేళ్ల కాలం పడుతుంది. దాంతో పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అందువల్లే చాలా మంది మధ్యవర్తుల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవడం ఉత్తమం అని భావిస్తుంటారు. అలాంటిది సెలబ్రిటిలు ఇలాంటి తలనొప్పిలను అస్సలు తలకెత్తుకోవాలనుకోరు. ఇదే సునిశిత్ లాంటి వాళ్లకి ప్లస్ అవుతుంది. కాబట్టి సునిశిత్ పనైపోలేదు , మళ్లీ రెచ్చిపోడని గ్యారంటీ లేదు .

watch video:


End of Article

You may also like