పెళ్లికి ముందే “లావణ్య త్రిపాఠి” కండిషన్స్..! మెగా కోడలు ఓకే అనాలి అంటే ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందేనా..?

పెళ్లికి ముందే “లావణ్య త్రిపాఠి” కండిషన్స్..! మెగా కోడలు ఓకే అనాలి అంటే ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందేనా..?

by kavitha

Ads

లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లావణ్య పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించి, అలరించింది. గత కొన్నేళ్ళ నుండి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపిస్తూ, వచ్చాయి.

Video Advertisement

ఆ వార్తలను నిజం చేస్తూ, వీరు గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి వివాహం నవంబర్‌లో జరుగనుందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి కోడలుగా వెళ్తున్ననేపథ్యంలో ఆమె తన కెరీర్‌లో విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది సమాచారం. ఈ క్రమంలో ఆమె గురించి తాజాగా ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగా కోడలు ఆనే ట్యాగ్ బరువైన బాధ్యతతో కూడినది అని చెప్పవచ్చు. ఆమె ఏం చేసిన మెగాఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని చేయాల్సి ఉంటుంది. అందువల్ల కాబోయే మెగా కోడలు లావణ్యాత్రిపాఠి తన కెరీర్ విషయంలో జాగ్రత్తగా,  అడుగులేస్తున్నారు. నిశ్చితార్థం తరువాత లావణ్య సినిమాలు చేయడం తగ్గించుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఒక మూవీ తప్ప ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. అయితే గతంలో ఒక  స్టోరీ నచ్చడంతో ఒక వెబ్ సిరీస్ కి లావణ్య  ఓకే చెప్పారట. ‘స్కైలాబ్‌’ మూవీ డైరెక్టర్ విశ్వక్‌ ఖండేరావ్‌ ఆ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.
lavanya-tripathiఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ పాత్ర బోల్డ్‌గా ఉంటుందని, ఇంటిమేట్‌ సీన్స్ కూడా చేయాల్సి ఉంటుందట. దాంతో లావణ్య ఆ వెబ్‌సిరీస్‌ మేకర్స్ కి తాను ఆ పాత్ర  చేయలేనని, వేరే హీరోయిన్ ను చూసుకోమని చెప్పిందంట. నిశ్చితార్థం తర్వాత మెగా ఫ్యామిలీ కోడల్ని. ఇలాంటి వాటిలో నటించడం సరి కాదని అన్నారట. ఈ క్రమంలోనే సెలెక్టివ్‌గా కొన్ని మూవీ ఆఫర్లను కూడా రిజెక్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ సమక్షంలో జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అధికారికంగా పెళ్లి ఎక్కడ అనేది అనౌన్స్ చేయకపోయినా, నవంబర్‌లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగబోతుందని ప్రచారాలు వినిపిస్తున్నాయి. వెడ్డింగ్ తరువాత హైదరాబాద్‌లో గ్రాండ్ గా రిసెప్షన్ ఉంటుందని టాక్.

Also Read: 20 ఏళ్ళ క్రితం హీరోయిన్ గా చేసిన హీరోకి… ఇప్పుడు తల్లిగా చేస్తున్న స్నేహ..! ఆ హీరో ఎవరంటే..?


End of Article

You may also like