హీరోయిన్‌గా మంచి హిట్ సినిమాలు అందించి తర్వాత పెళ్లి చేసుకుని ఈ పాత్రకి విడ్కోలు పలికిన హీరోయిన్లలో స్నేహ ఒకరు.

Video Advertisement

పెళ్లయి భర్తతో హాయిగా ఉన్న స్నేహ కొన్నేళ్ల తర్వాత సినిమాల్లో కీలకమైన రోల్స్ చేస్తోంది.

అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గానే ఉండే స్నేహ క్రేజీ ఆఫర్‌ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్‌తో 20ఏళ్ల కిందట ఓ సినిమా చేసింది. మళ్లీ 20ఏళ్ల తర్వాత తనతో జోడీ కట్టనున్నట్లు సమాచారం. వెంకట్ ప్రభు, విజయ్ కాంబోలో రానున్న సినిమాలో ఇద్దరి హీరోయిన్లను ఎంపిక చేసినట్లు తెలిపారు.

అందులో ఒక హీరోయిన్‌గా స్నేహను ఎంపిక చేసినట్లు టాక్. విజయ్, స్నేహ 20ఏళ్ల కిందట ‘వశీకర’ సినిమాలో నటించారు. హిట్‌గా నిలిచిన ఈ సినిమా వీరిద్దరి పెయిర్‌ కూడా బాగుందని మంచి రెస్పాన్స్ వచ్చింది.

మళ్లీ ఇదే రెస్పాన్స్‌ను క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ నటిస్తున్న ఈ 68వ సినిమాని ఏజీఎస్ ఎంటర్‌టైనమెంట్ సంస్థ నిర్మిస్తుంది.