ఈ ఒక్క కారణం వల్ల లావణ్య త్రిపాఠి హిట్ సినిమా వదులుకున్నారా..? అదేంటంటే..?

ఈ ఒక్క కారణం వల్ల లావణ్య త్రిపాఠి హిట్ సినిమా వదులుకున్నారా..? అదేంటంటే..?

by Harika

Ads

గీత గోవిందం ఆ మూవీ పేరు చెబితేనే ఓ ట్రాన్సలోకి వెళ్ళిపోతారు చాలామంది. అప్పటివరకు రౌడీ బాయ్ ఇమేజ్ లో ఉన్న విజయ్ దేవరకొండకు ఓ మంచి ఫ్యామిలీ ఇమేజ్ క్రియేట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ లో పాపులర్ చేసిన మూవీ ఇది. మరోపక్క రష్మిక మందన్నా కు హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది ఈ మూవీ. 2018 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం విపరీతమైన స్పందన అందుకుంది.

Video Advertisement

అయితే ఈ మూవీలో హీరోయిన్గా మొదట రష్మిక అని అనుకోలేదట. మొదట ఈ క్యారెక్టర్ కి డైరెక్టర్ ఛా యిస్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి. అయితే ఈ చిత్రం కాన్సెప్ట్ అంతా నచ్చినప్పటికీ.. లిప్ లాక్ సీన్స్ ఉండడంతో లావణ్య నిర్వాహమాటంగా ఈ మూవీకి నో చెప్పిందట. దీంతో ఈ మూవీ ఫైనల్ గా రష్మిక ఖాతాలు పడింది. అలా రష్మిక కు నేషనల్ క్రష్ అయ్యే ఛాన్స్ ని లావణ్య తెలియకుండానే ఇచ్చేసింది.

అందాల రాక్షసి మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి తన అందమైన నటనతో అందరిని ఆకట్టుకుంది. సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ ముందుకు వెళ్తున్న ఈ హీరోయిన్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తన ప్రేమ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచింది.. అందరికీ సడన్ షాక్ ఇస్తూ ఈ జంట తమ ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత తమ ప్రేమకు పునాది వేసిన ఇటలీలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. వరుణ్ కి బాగా కమిటెడ్ గా ఉండడంతోటే లావణ్య పెళ్లికి ముందు నుంచి ఏ సినిమాలో కూడా లిప్ లాక్ సీన్స్ చేయలేదు. మంచి ఆఫర్లు వచ్చినా.. బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా వదులుకోవడానికి ఆమె ఏమాత్రం వెనుకాడ లేదు. దీనికి గీతాగోవిందం మూవీ ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు నెటిజన్స్.


End of Article

You may also like