Ads
సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ గా జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేలుతో తలైవార్ 170 సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ చిత్రంతోపాటు తలైవార్ 171 షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. 171 చిత్రాన్ని ప్రముఖ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ను ఢీకొట్టడానికి ఒక స్టార్ హీరోని విలన్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.
Video Advertisement
తమిళ మీడియా కథనాల ప్రకారం ఈ సినిమాలో విలన్ గా రాఘవ లారెన్స్ నటిస్తున్నారట. చిన్నప్పటినుండి రజినీకాంత్ అభిమాని అయిన లారెన్స్ ఎప్పటినుండో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు లోకేష్ కనగరాజు రజనీతో చేస్తున్న సినిమాలో ఒక పవర్ ఫుల్ నెగటివ్ రోల్ ఆఫర్ ఇచ్చారని, ఇక రజినీతో సినిమా అనగానే విలన్ రోల్ అయినా పరవాలేదు లారెన్స్ ఓకే చెప్పారని కథనాలు వస్తున్నాయి.రజనీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రం ఎంత విజయం సాధించిందో తెలిసిందే. రజనీకాంత్ ని అభిమానించే లారెన్స్ ఆయనని స్ఫూర్తిగా తీసుకుని చంద్రముఖి 2 సినిమాలో నటించారు. కేవలం రజినీకాంత్ పాత్రలో తాను చేయడం ఇష్టపడే చంద్రముఖి 2 సినిమాని చేసినట్టుగా లారెన్స్ తెలిపారు సమయం దొరికినప్పుడల్లా లారెన్స్ రజినీకాంత్ పైన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.
కానీ ఈ వార్త పైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇక లోకేష్ సినిమాలో హీరోలు విలన్ గా నటించడం కామనే, పైగా వాళ్ళని హీరోతో సమానంగా ఎలివేట్ చేస్తూ ఉంటారు. దీంతో లారెన్స్ విలన్ గా నటిస్తున్నారనే వార్తలు వినగానే లోకి లారెన్స్ ని ఏ రేంజ్ లో చూపిస్తారా అన్న అంశం పైన సినీ ప్రియులు ఇప్పటినుండి ఊహించడం ప్రారంభించేశారు.అయితే లోకేష్ రజనీకాంత్ తో తీసే సినిమా మాత్రం LCU కి సంబంధం లేదట. ఇది మాస్టర్ తరహాలో స్టాండ్ అలోన్ ఫిల్మ్ గా చెబుతున్నారు.
Also Read:ఇంత మంచి సినిమాని ఎవరు పట్టించుకోలేదా..? ఈ సినిమా చూశారా..?
End of Article