ఎప్పుడూ చలాకీగా ఉండే లాయర్ ఇలాంటి పని ఎందుకు చేసింది..? మేనమామ అలా చేయడం వల్లేనా?

ఎప్పుడూ చలాకీగా ఉండే లాయర్ ఇలాంటి పని ఎందుకు చేసింది..? మేనమామ అలా చేయడం వల్లేనా?

by Anudeep

Ads

ఆమె ఓ లాయర్. తన వద్దకి వచ్చే బాధితులకు న్యాయం చేస్తూ ఉంటుంది. కానీ, తానే అన్యాయంగా బాధితురాలిగా మిగిలిపోయింది. కోర్టులో చలాకీగా ఉండే లాయర్ శివాని చివరకు విగత జీవిగా ఎందుకు మిగిలిపోయింది అనేది మిస్టరీగా మారింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటనపై పూర్తి వివరాలు చూద్దాం.

Video Advertisement

హైదరాబాద్ చందానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానసిక ఒత్తిడి, గృహ హింస వలన ఒత్తిడికి లోనై ఓ మహిళా క్షణిక ఆవేశంలో ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే ఆమె పేరు శ్రీవాణి.

sreevani 1

ఇప్పటికే న్యాయవాద విద్యను పూర్తి చేసింది. మరో సీనియర్ లాయర్ వద్ద ఆమె జూనియర్ గా పని చేస్తోంది. అంతే కాకుండా సొంతంగా ఆఫీస్ ను కూడా ఓపెన్ చేసుకుంది. ఐదు సంవత్సరాల క్రితమే మల్లి కార్జున్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దలను ఒప్పించి అతనినే పెళ్లి చేసుకుంది. మల్లికార్జున్ సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు.

sreevani 2

వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. కాగా, నల్లగండ్ల ప్లైఓవర్‌ దగ్గరే శ్రీవాణి స్టాంప్స్‌ అండ్‌ వెండర్స్‌ అనే ఆఫీస్ ను ఓపెన్ చేసుకుంది. మార్చ్ 27 నే ఆమె మేనమామ ఆఫీస్ నుంచి స్టాంప్ పేపర్లను దొంగతనం చేసాడు. ఈ విషయమై భార్యాభర్తలిద్దరికీ గొడవ జరిగింది. మేనమామతో, అతని భార్యతోను గొడవలు అవుతుండడంతో భర్త శ్రీవాణిని హెచ్చరించాడు. ఈ విషయమై శ్రీవాణి మనస్తాపం చెంది భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

sreevani 3

శ్రీవాణి సోదరి వర్షిత కూడా అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంట్లో ఒడిబియ్యం కార్యక్రమం పెట్టుకోగా.. ఈ సందర్భంలో మేనమామ కుటుంబంతో వాగ్వాదం జరిగింది. వారందరు మాట్లాడుకుంటూ ఉండగానే ఆమె భవనం పై నుంచి దూకేసింది. కాగా ఆమె ఆత్మహత్యకి తమ్ముడు రఘు, అల్లుడు మల్లిఖార్జున్ కారణమని ఆమె తల్లి హేమ చందానగర్ పోలీసులకు కంప్లైంట్ చేసారు.

 


End of Article

You may also like