Ads
సినీ పరిశ్రమలో ఎప్పటి నుండో నార్త్, సౌత్, బాలీవుడ్, టాలీవుడ్ ఫైట్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. రాజమౌళి తీసిన ప్యాన్ ఇండియా మూవీస్ తో ఇప్పుడు ఆ పోరు కాస్త తగ్గుతుంది. కానీ ఇటు తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా పనికి రారా?? కేవలం బాలీవుడ్ అమ్మాయిలే పని వస్తారా అనే విమర్శలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటు లయ కూడా తన బాధను వ్యక్తం చేశారు. ఒక సినిమాలో బాలయ్యకి చెల్లి పాత్ర వేయాల్సి వచ్చింది.
Video Advertisement
అప్పుడు నటి లయ కన్నీరు పెట్టుకుని, తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా పనికి రారా?? నేను బాలయ్యకి చెల్లెలిగా చెయ్యాలా అంటూ బాధని వ్యక్తం చేసింది. ఈ విషయంపై తాజాగా సీనియర్ నటి జయసుధ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమను గట్టిగా ప్రశ్నించారు.
Also Read: మెగా ఫ్యామిలీ లోకి “కోడలు”గా అడుగుపెట్టబోతున్న “మేఘన” బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా.?
అయితే ఆది సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ను పరిచయం చేసి సూపర్ సూపర్ హిట్ ఇచ్చారు డైరెక్టర్ v.v. వినాయక్. అదే రీతిలో బాలయ్యతో మరో ఫ్యాక్షన్ మూవీ తియ్యాలి అనుకున్నారు. ఇది తెలిసిన ప్రేక్షకులు అప్పటికే ఆది హిట్ అవ్వడంతో, మరింత ఉత్సహాన్ని చూపించారు. అనుకున్నట్టుగానే చెన్నకేశవ రెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. కాగా అందులో బాలయ్యను ద్విపాత్రాభినయం ఉండటం… కథలో భాగంగా ఫ్యాక్షన్ ఫ్యామిలీకి చెందిన బాలయ్యకు ఒక చెల్లెలి పాత్ర కావాల్సి వచ్చింది. దీనికి నటి లయ సరిగ్గా సరిపోతారనే అభిప్రాయంతో, రామోజీ ఫిలిం సిటీలో షూట్ లో ఉన్నప్పుడు తనను వెళ్లి కలిసారట v.v. వినాయక్.
అప్పుడు ఇలా చెల్లెలి పాత్రకు మీరు చేస్తారా అని లయను అడిగితే, వెంటనే కంట నీరు పెట్టుకుని ఏంటండీ!! తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా పనికిరారా?? కేవలం అక్క,చెల్లి, అమ్మ, ఇలాంటి పాత్రలకే పనికి వస్తారా?? అని ఏడ్చేసారంట. దీంతో అదేమీ లేదండి, మీరు అమాయకంగా ఉంటారు, ఆ పాత్రకు బాగా నొప్పుతారని అడిగాను అంతే తప్పుగా అనుకోకండి అంటూ వచ్చేశారట. కానీ లయ అడిగిన ప్రశకు ఆయన దగ్గర సమాధానం లేదని v.v. వినాయక్ చెప్పారు. ఇక లయ ఒప్పుకోకపోవడంతో దేవయానిని అడిగితే తను వెంటనే ఒప్పుకుంది చెప్పారు.
ఇకపోతే బాగా పేరొందిన తెలుగు హీరోయిన్లను వేళ్ళతో లెక్కపెట్టవచ్చు అంటున్నారు, కొందరు నెటిజన్లు. అంజలి, ఇంద్రజ, లయ, రితు వర్మ, నిధి అగర్వాల్, టబు, పద్మ ప్రియ, సుష్మిత సేన్, జయలలిత, ఇలా కొందరి పేర్లు బాగా తెలుసు. అందులో కొందరికి తెలుగు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఇతర భాషల్లో ఎక్కువ సినిమాలు చేసి పేరు తెచ్చుకున్నవారే ఎక్కువ మంది.
End of Article