మెగా ఫ్యామిలీ లోకి “కోడలు”గా అడుగుపెట్టబోతున్న “మేఘన” బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా.?

మెగా ఫ్యామిలీ లోకి “కోడలు”గా అడుగుపెట్టబోతున్న “మేఘన” బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా.?

by Anudeep

Ads

కొణిదెల కుటుంబం నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొణిదల పవన్ తేజ అందరికీ పరిచయం. ఈ మధ్యనే పవన్ తేజ్ కు యాంకర్ మేఘనతో గురువారం నాడు ఘనంగా నిశ్చితార్థం వేడుక జరిగింది.

Video Advertisement

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్రం ద్వారా అతని నటన తో హీరోగా అందరినీ ఆకట్టుకున్నాడు పవన్ తేజ్. అదే చిత్రంలో హీరోయిన్ గా యాంకర్ మేఘన నటించారు. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య పుట్టిన ప్రేమకు ఇరువైపుల పెద్దలు పచ్చ జెండా ఊపడంతో త్వరలోనే వారు పెళ్లి పీటలెక్కబోతున్నారు.

ఈ క్రమంలో మెగా కుటుంబంలో కాలు పెట్టబోతున్న కొత్త కోడలు మీద ఆసక్తితో ఎందరో మెగా అభిమానులు ఆమెకు సంబంధించిన బ్యాగ్రౌండ్ తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నారు. ప్రస్తుతం పవన్ తేజ్ మరియు మేఘన ఎంగేజ్మెంట్ వీడియోలు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. 2018 లో నవదీప్ హోస్ట్ చేసిన “టాలీవుడ్ స్క్వేర్స్” షోతో బుల్లితెరకు పరిచయం అయ్యారు మేఘన. ప్రస్తుతం ఈటీవీ ప్లస్ లో “రెచ్చిపోదాం బ్రదర్” షో లో యాంకర్ గా చేస్తున్నారు.

“ఈ కథలో పాత్రలు కల్పితం” చిత్రంతో 2021 లో సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసారు మేఘన.మేఘనకు చిన్నతనం నుంచి యాంకరింగ్ అంటే ఉన్న ఇష్టంతో ఆమె చాలా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకోండి. ఈ క్రమంలో ఆమెతో కలిసి నటించిన పవన్ తేజ్ కు ఆమెకు అభిప్రాయాలు ఏకీభవించడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

ఇక మేఘన కుటుంబం విషయానికి వస్తే, ఆమె తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పదవిలో ఉన్నారని సమాచారం. అంతేకాక ఆమె కుటుంబానికి భారీగా కాకినాడలో ఆస్తులు ఉన్నాయని, ఆమె చాలా కోటీశ్వరురాలు అని సమాచారం. ఈ విషయం తెలిసిన వారు “ధనవంతురాలు అయినప్పటికీ మేఘన రియల్ లైఫ్ లో సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వడం హర్షించదగ్గ విషయమని”ఆమెను ప్రశంసిస్తున్నారు.


కానీ ఇంకా వీళ్ళిద్దరి పెళ్లి కి తేదీ కన్ఫర్మ్ కాలేదు. నెట్లో అప్లోడ్ అయిన వీరి నిశ్చితార్థం వీడియోని చూసి ” మీరు పెళ్లి చేసుకొని కలకాలం అన్యోన్యంగా ఉండాలి ” అని నెటిజన్ల వీరిద్దరిని ఆన్లైన్ లో దీవించారు. ఏది ఎలా ఉన్నప్పటికీ మెగా కుటుంబం లాంటి పెద్ద కుటుంబానికి కోడలు అవుతున్న మేఘన పెళ్లి తర్వాత తన కెరీర్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాలి.


End of Article

You may also like