నేటి తరం ఝాన్సీ.. కళ్ళముందే ప్రాణాలు తీస్తున్న సైకోని అడ్డుకుని..? ఈమె తెగువకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

నేటి తరం ఝాన్సీ.. కళ్ళముందే ప్రాణాలు తీస్తున్న సైకోని అడ్డుకుని..? ఈమె తెగువకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

by Sainath Gopi

Ads

ఓ ప్రేమోన్మాది తాను ప్రేమించిన అమ్మాయిపై దాడికి దిగబడ్డాడు. ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అడ్డొచ్చిన ఆమె సోదరుడిని కత్తితో పొడిచేసాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీ నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Video Advertisement

వివరాల్లోకి వెళితే, రంగారెడ్డి కొందుర్గు మండలానికి చెందిన సురేందర్ గౌడ్, ఇందిరమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. మొదటి సంతానం సంఘవి కాగా, రెండవ సంతానం పృథ్వి. సంఘవి హోమియో కళాశాలలో నాలుగవ సంవత్సరం చదువుతూ ఉండగా, పృథ్వి ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడు.

నేరెళ్ల గ్రామానికి చెందిన శివకుమార్ సంఘవి తో కలిసి ఒకే పాఠశాలలో పదవతరగతి చదివాడు. అప్పటి నుంచే ఆమెను ప్రేమ పేరుతొ వేధించడం మొదలుపెట్టాడు. సంఘవి హైదరాబాద్ కు వచ్చేసినా అతని వేధింపులు మాత్రం ఆగలేదు. మరోవైపు డిగ్రీ పూర్తి చేసి రామంతాపూర్ లోనే నివాసం ఉంటున్నాడు. ఇటీవల సంఘవిని కలిసి ప్రేమ విషయం చెప్పగా.. ఆమె గట్టిగ మందలించింది. దీనితో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ఆమె చిరునామా తెలుసుకుని ఆదివారం ఆమె ఇంటికి వెళ్ళాడు. సోదరుడు బయటకు వెళ్లాడని నిర్ధారించుకున్నాక ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఆమెను కత్తి చూపించి బెదిరించాడు. అదే సమయంలో ఆమె సోదరుడు రావడంతో శివకుమార్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, శివకుమార్ ఆవేశంలో పృథ్విని కత్తితో పొడిచి చంపేశాడు. గాయాలతో ఉన్న సమయంలోనే పృథ్వి బయటకు వచ్చి బయట గడి పెట్టి అక్కడే కుప్పకూలాడు. యువతీ కేకలు వినిపించడంతో పక్కింట్లో ఉన్న ఝాన్సీ బయటకు వచ్చారు.

బయట ఉన్న పృథ్విని చూడగా.. అక్కపై దాడి జరుగుతోందని చెప్పడంతో వెంటనే ఓ కర్ర తీసుకుని ఆమె అప్రమత్తం అయ్యారు. ఓ వైపు వీడియో రికార్డు చేస్తూ కర్రతో ఆ యువకుడు ఉన్న గదివైపు వెళ్లారు. ఆ యువకుడిని బెదిరిస్తూనే మరో వైపు చుట్టుపక్కల వారిని పోగేశారు. చుట్టూ ఉన్న వారు రావడంతో శివకుమార్ కొంత వెనక్కి తగ్గాడు. అదే అదనుగా తీసుకుని మరో ద్వారం నుంచి యువతిని బయటకు తీసుకొచ్చి రక్షించారు. ఈ దుర్ఘటనలో పృథ్వి మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై ఝాన్సీ తెగువని మాత్రం నెటిజన్స్ అభినందిస్తున్నారు. పృథ్వి మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : రాత్రిపూట “పిక్కలు” పట్టేస్తున్నాయా.? అయితే జాగ్రత్త! మీలో ఈ మార్పులు జరుగుతుందని అర్ధం.!


End of Article

You may also like