“మెగాస్టార్ చిరంజీవి” వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ఎల్బీ శ్రీరామ్ గారు ఏమన్నారంటే?

“మెగాస్టార్ చిరంజీవి” వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ఎల్బీ శ్రీరామ్ గారు ఏమన్నారంటే?

by Mohana Priya

Ads

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చిరంజీవికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎంత మంది హీరోలు వచ్చినా కానీ చిరంజీవికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. చిరంజీవి సినిమాల్లో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా మంచి పనులు చేస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.

Video Advertisement

చిరంజీవి గురించి కేవలం అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పారు. అలాగే ప్రముఖ నటులు ఎల్.బి.శ్రీరామ్ కూడా చిరంజీవి నిజ జీవితంలో ఎలా ఉంటారు అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నని కోరాలో ఒక యూజర్ అడిగారు.

remake hit movies of chiranjeevi

చిరంజీవి గురించి ఎల్.బి.శ్రీరామ్ గారు ఈ విధంగా చెప్పారు. “చిరంజీవి గారితో నాకు చాలా మధురానుభూతులు ఉన్నాయి. కొంత గ్యాప్ తర్వాత ఆయనకు వచ్చిన సూపర్ హిట్ “హిట్లర్”కు నేనే డైలాగ్ రైటర్‌ని. చిరంజీవి పాత్ర, తన పెద్ద చెల్లెలిని అత్తారింటికి పంపేప్పుడు సీన్ కొంత కొత్తదనంతో రాశాను. సామాన్యంగా ఆడపిల్లను అత్తారింటికి పంపేప్పుడు తల్లిదండ్రులు, అన్నగారు వీళ్ళకు డైలాగులు ఎక్కువ ఉంటాయి.

కానీ, ఇక్కడ రివర్స్ చేసి ఆ అమ్మాయికి డైలాగులు ఎక్కువ రాసి, చిరంజీవి గారికి ఒకటే డైలాగ్ రాశాను – “అమ్మా! మీ అన్నయ్య నీకేం పెట్టాడని ఎవరైనా అడిగితే, చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టాడని చెప్పు.. చివరికి ఎంతో కష్టం పెట్టాడని చెప్పు” అని. ఈ డైలాగులు చెప్పినప్పుడు చిరంజీవి గారు అద్భుతంగా రాశారు రైటర్ అని ఎంతగానో మెచ్చుకున్నారట. అట ఎందుకంటే ఆ సమయానికి నేను అక్కడ లేను.

chiranjeevi faces troubles in 2nd innings

సాయంత్రం షూటింగ్ అయిపోయి చిరంజీవి గారు వెళ్ళిపోయాకా మొత్తం క్రూ అంతా నన్ను అభినందనలతో ముంచెత్తి, ఆ టైంకి మీరు ఉంటేనా అని ఊరించేశారు.హిట్లర్ సినిమా విషయమై చిరంజీవి గారితో ఒక మాట అన్నాను. “జంధ్యాల గారు ఎప్పుడూ అంటూ ఉండేవారు. మాటల రచయితకు మాటలు రాయడం కష్టం కాదు రాయకపోవడం కష్టం. ఒలింపిక్స్ గేమ్‌లో కాళ్ళకు సంకెళ్ళు వేసి పరుగులు పెట్టాలని అన్నట్టుగా అయింది నా పని. చిరంజీవి గారికి డైలాగులు రాసే అవకాశం అనుకోగానే రీములు రీములు బ్రహ్మాండమైన డైలాగులు రాసేద్దాం అని ఒక రచయితగా ఉత్సాహం వచ్చేస్తుంది.

కానీ, ఇక్కడ చూస్తే మీది ఆచితూచి మాట్లాడే క్యారెక్టర్ డిజైన్ చేశారు. చాలా కంట్రోల్ చేసుకుని రాయాల్సి వచ్చిందండీ.” అని. “జంధ్యాల గారు ఎంతో బాగా చెప్పారు. నిజమే. మరి అదే కదా, రైటర్‌కి కానీ, యాక్టర్‌కి కానీ ఛాలెంజ్. ఛాలెంజ్‌లు తీసుకుని సక్సెస్ కావడమే కదా మనకు గొప్ప. మీరు బాగా రాశారు.” అన్నారు చిరంజీవి గారు. ఐదుగురు చెల్లెళ్ళకు అన్నయ్యగా బాధ్యతాయుతమైన, పవర్‌ఫుల్ పాత్ర. ఏ డైలాగ్ రాద్దామనుకున్నా “అంతొద్దు” అని కొట్టేసి, “ఇది చాలు” అని ఇంకో చిన్న డైలాగ్ రాస్తూ నాలో నేనే అనుకునేవాడిని.

lb sriram about chiranjeevi real life behavior

ఇదేదో బావుందని “అంతొద్దు” – “ఇది చాలు” అన్నదే చిరంజీవి గారి మ్యానరిజంగా పెట్టాను. ఆయన చాలా బ్రహ్మాండంగా ఆ డైలాగులు చెప్పి, తూకంగా నటించి పండించారు. సినిమా విడుదలై, సూపర్ హిట్ అయ్యాకా చూసుకుంటే – ఒక గొప్ప నటుడికి, చక్కని ప్యాట్రన్‌లో, మంచి డైలాగులు రాసి విజయం పొందిన సంతృప్తి కలిగింది.
ఆ తర్వాత నేను నటుడిగా క్లిక్ అయిన సినిమా “చాలా బాగుంది”. ఈ సినిమాలో క్లిక్ అయ్యాకా, మా ఈవీవీ గారు పట్టుబట్టి నన్ను చిరంజీవి గారి దగ్గరకు తీసుకువెళ్ళారు.

lb sriram about chiranjeevi real life behavior

చిరంజీవి గారు కూడా అప్పటికే సినిమా చూసి నా పాత్రను ఎంతగానో మెచ్చుకుని, నన్ను స్వయంగా అభినందిద్దామని ఆశిస్తున్నారట. అలా కలిసినప్పుడు ఆయన ఎంతో మెచ్చుకున్నారు. ఒక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. చాలా బాగుంది సినిమాలో నేను ఒక తమాషా పద్ధతిలో డైలాగులు చెప్పాను కదా. ఆయన ఇంట్లో సరదాగా, మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ఆ డైలాగ్ డెలివరీ స్టైల్‌లో మాట్లాడుతూ నవ్వించేవారట.

chiranjeevi faces troubles in 2nd innings

మృగరాజు సినిమాలో నేను ఒళ్ళంతా రకరకాల పూసలు అవీ పెట్టుకుని ఒక తమాషా గెటప్‌తో పాత్ర వేశాను. షాట్‌గ్యాప్‌లో చిరంజీవి గారికి కొంచెం దూరంగా నేను కూర్చునేవాడిని. “కొంచెం దగ్గరకి వచ్చి కూచ్చోవచ్చు. అలా దూరంగా కూచోక్కరలేదు.” అని సరిగ్గా చాలాబాగుంది సినిమాలో నేను ఎలా చేసేవాడినో అలానే అనేవారు. “మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని” నేను నసిగేవాడిని. ఆయన నవ్వేసేవారు. దగ్గరకి వచ్చి కూర్చున్నప్పుడు

“ఎల్బీ కొంచెం ఒళ్ళు చేసినట్టున్నావు” అన్నారు,

“ఒక తులం సార్” అంటే

“అది సక్సెస్ ఒళ్ళులే. మంచిదే.” అని అభినందించారు.

lb sriram about chiranjeevi real life behavior

“స్టాలిన్” సినిమా క్లైమాక్స్‌లో ఎందరినో చిటికెన వేలితో లేపేయగల మెగాస్టార్ చిరంజీవి గారినే ఒక విషమ పరిస్థితిలో ఒక పాత్ర రక్షణ కల్పించాల్సి వస్తుంది. ఆ వ్యక్తి ఎవరై ఉండాలి, ఆ పాత్ర పోషించే ఆర్టిస్టుకి ఏ రకమైన ఇమేజ్ ఉండాలి అన్న తర్జనభర్జన జరిగింది. చివరికి ఆ పాత్రకు ఎల్బీ శ్రీరామ్ కరెక్టు అని చిరంజీవి గారు భావించారు. ఆ సినిమా దర్శకుడు తమిళుడు కదా, నన్ను “చాలా బాగుంది” సినిమాలో చూశారు. ఒక కమెడియన్ ఇలాంటి పాత్రను పోషిస్తే వర్కవుట్ అవుతుందా అని ఆయనకు సందేహం వచ్చి, చిరంజీవి గారికి అదే చెప్పారట.

“ఎల్బీ మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, మీరు అమ్మో ఒకటో తారీఖు ఒకసారి చూడండి. అప్పుడు డిసైడ్ చేద్దాం.” అని తను అమ్మో ఒకటో తారీఖు సినిమా సీడీ తెప్పించి, ఆయనకి ఇచ్చి అలా ఒప్పించి మరీ ఆ పాత్ర నాకు ఇచ్చారు. అంతటి గొప్ప హీరో, మెగాస్టార్ అలా నన్ను ఇమిటేట్ చేసి మరీ అభినందించడం, నా టాలెంట్ గమనించి పట్టుపట్టి ఈ క్యారెక్టర్ ఎల్బీనే న్యాయం చేస్తాడని ఇప్పించడం – ఇవన్నీ తలుచుకుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఆయన సంస్కారం అలాంటిది.” అని ఎల్.బి.శ్రీరామ్ చెప్పారు.

sourced from : Quora


End of Article

You may also like