గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ హీరో ఎవరో తెలుసా..? రెండేళ్ల తర్వాత సినిమాతో..?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ హీరో ఎవరో తెలుసా..? రెండేళ్ల తర్వాత సినిమాతో..?

by Harika

Ads

ఎంతో మంది ముందు ఎన్నో రంగాల్లో ఉండి, ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెడతారు. అలా ఒక వ్యక్తి వ్యాపార రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న తర్వాత 2022 లో సినిమా చేశారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా ఆయనే. 2022 లో ది లెజెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు శరవణన్. శరవణ స్టోర్స్ అధినేతగా వ్యాపార రంగంలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి హీరోగా అడుగు పెట్టారు.

Video Advertisement

legend saravanan is making movie after two years

ఆ తర్వాత మళ్లీ శరవణన్ సినిమా చేస్తారు అని అన్నారు కానీ దానికి సంబంధించిన వివరాలు ఏవి ఇప్పటి వరకు రాలేదు. అయితే, ఇప్పుడు శరవణన్ నటించబోతున్న సినిమా ప్రారంభం అయ్యింది. దురై సెంథిల్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గరుడన్ అనే సినిమాకి అంతకుముందు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం శరవణన్ తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నారు. గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నటించే నటుల వివరాలు ఇంకా తెలియలేదు.

ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే శరవణన్ హీరోగా వచ్చిన ది లెజెండ్ సినిమా మీద మాత్రం కామెంట్స్ వచ్చాయి. శివాజీ తో పాటు ఇంకా కొన్ని సినిమాలను ఈ సినిమాలో కలిపి తీసినట్టు చాలా మంది అన్నారు. సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్. కానీ ఆ ప్రభావం సినిమా మీద కనిపించలేదు. కొన్ని సీన్స్ మీద అయితే కామెంట్స్ వచ్చాయి. యాక్షన్ సీన్స్ సరిగ్గా కంపోజ్ చేయలేదు అని చాలా మంది అన్నారు. సినిమా కథ కూడా అర్థం కానట్టుగా ఉంటుంది. చాలా చోట్ల సినిమాలో లాజిక్ మిస్ చేశారు. కొన్ని చోట్ల మరీ చాలా ఆలోచించకుండా పొరపాట్లు చేశారు.

అవన్నీ తెర మీద చూస్తున్నప్పుడు అందరికీ చాలా సులభంగా అర్థం అయిపోతాయి. సింపుల్ గా పరిష్కరించే విషయాలను కూడా ఈ సినిమాలో చాలా సాగదీసినట్టు చూపించారు. అందుకే ఈ సినిమా మీద కామెంట్స్ వచ్చాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి శరవణన్ మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాతో వస్తున్నారు ఏమో. ఎందుకంటే మొదటి సినిమా నుండి రెండవ సినిమాకి ఇంత సమయం తీసుకున్నారు కాబట్టి తనని తాను మెరుగుపరుచుకొని, కథపరంగా కూడా జాగ్రత్తలు తీసుకొని ఉంటారు అని చాలా మంది అంటున్నారు.

 


End of Article

You may also like