లియో OTT లోకి ఎప్పుడంటే…..!!!!

లియో OTT లోకి ఎప్పుడంటే…..!!!!

by kavitha

Ads

దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఇటీవల వచ్చిన చిత్రం “లియో”. అక్టోబర్ 19న రిలీజైన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.550 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది.

Video Advertisement

ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

లియో మూవీ ఈనెల 16 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తాజా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ తేదీపై కూడా మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో నవంబర్‌ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కావొచ్చని వార్తలు వినిపించాయి. ఇటీవలే ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీక్‌ అయిందని.. అందువల్లే వారం రోజులు ముందుకానే ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశముంది. విజయ్‌కు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్‌ ఉంది. తెలుగు ప్రేక్షకులు సైతం ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి.

లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన లియో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చినా మూడవ సినిమా కాగా అందులోని కొన్ని పాత్రల గురించి తెలియాలంటే మూడు సినిమాలు చూడాల్సిందే.అందులోది మొదటిది కార్తీ నటించిన ఖైదీ కాగా రెండవది కమల హాసన్,ఫహద్ ఫాసిల్ నటించిన విక్రమ్.మూడు సినిమాలు యాక్షన్,డ్రామా, క్రైమ్ కి సంబందించిన జానర్ లోకి వచ్చినవే. యాక్షన్ సినిమాలయూ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు,సినిమా హాల్ లో మిస్ అయిన వాళ్ళు ఈ చిత్రం ott ప్లాట్ఫారం లోకి వస్తుంది అని ఎదురుచూస్తున్నారు.

 

“లియో” సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని ౩వ చిత్రం.ఇందులో అర్జున్,సంజయ్ దుత్త ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు పోషించారుకాగా.. లియో ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.


End of Article

You may also like