కరోనా నేపథ్యంలో ఓ మాల్ క్రియేటివిటీ…లిఫ్ట్ లో బటన్స్ కి బదులు ఏం పెట్టారంటే?

కరోనా నేపథ్యంలో ఓ మాల్ క్రియేటివిటీ…లిఫ్ట్ లో బటన్స్ కి బదులు ఏం పెట్టారంటే?

by Anudeep

Ads

ముట్టుకుంటే అంటుకునే రోగం కరోనా భయం ప్రజల్లో ఇప్పడప్పుడే పోయేలా లేదు..కరోనా మూలంగా మరణాల శాతం తక్కువే అయినప్పటి ఒక రకమైన భయానికి లోనవుతున్నారు ప్రజలు..అందుకు ఉదాహరణ వ్యక్తిగత శుభ్రత, మాస్కుల ధారణలో చూపుతున్న ప్రత్యేక శ్రద్దే..లాక్ డౌన్ ఎత్తివేసినా, లాక్ డౌన్లో సడలింపులు ప్రకటించినా కూడా గతంలో మాదిరిగా రొటీన్ లైఫ్ గడపడానికి జంకుతున్నారు..అలాంటి భయాన్ని పోగొట్టే పనిలో భాగంగానే ఒక షాపింగ్ మాల్ యాజమాన్యం భిన్నంగా ప్లాన్ చేసింది.

Video Advertisement

షాపింగ్ అంటే ఇష్టపడని వారుండరు, కొనేది ఏం లేకపోయినా విండో షాపింగ్ పేరిట కూడా షాపింగ్ ని ఎంజాయ్ చేసే జనం కోకొల్లలు..అలాంటి వారిని సైతం భయపెడుతోంది కరోనా.థాయ్ లాండ్ లో షాపింగ్‌ మాల్స్ తెరిచినా వెళ్లడానికి ప్రజలు వెళ్లడానికి ఇష్టత చూపించట్లేదు.. దీంతో థాయ్ లాండ్ లోని ఓ మాల్ లిఫ్ట్ బటన్స్ కు బదులుగా ఫుట్ పెడల్స్ ను అమర్చింది. కరోనాను నియంత్రించడంతో పాటు ప్రజలను మళ్లీ షాపింగ్ కు అలవాటు పడేలా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ఫూట్ పెడల్స్ ఏర్పాటు..

సాధారణంగా లిఫ్ట్స్ లో బటన్స్ వాడుతుంటారు. కానీ కరోనా వ్యాప్తి జరిగే వాటిల్లో డోర్ హ్యాండిల్స్, లిఫ్ట్ బటన్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి..ప్రతి ఒక్కరూ చేతితో తప్పనిసరిగా తాకే అవసరం ఉంటుంది..ఈ క్రమంలో ఎన్ని రకాల వైరస్లు ఒకరి నుండి ఒకరికి ప్రయాణిస్తాయో తెలీదు . ఇదే విషయాన్న దృష్టిలో పెట్టుకుని బ్యాంకాక్ లోని సీకన్ స్క్వేర్ లో ఎలివేటర్స్ లోపల పెడట్స్ ను బిగించారు. ఏ ఫ్లోర్ కు వెళ్లాలో ఆ నంబర్ లేదా లెటర్స్, సింబల్స్ కు ఎదురుగా బిగించి ఉన్న పెడల్ ను నొక్కేలా ఏర్పాటు చేశారు.

ఎలివేటర్ ను ప్రెస్ చేయాలంటే కాలితో నొక్కాలి.. దాని వలన వైరస్ వ్యాప్తి చెందకుండా చూడవచ్చు, కస్టమర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఏర్పాటు చేసామని మాల్ యాజమాన్యం చెప్తుంది. ఈ ఐడియా  నిజంగ్రా గ్రేట్ అని ఒక కస్టమర్ సంతోషం వ్యక్తం చేశాడు. మరికొందరు మార్కెంటింగ్ స్ట్రాటజీలో భాగంగానే ఇది ఏర్పాటు చేసారని కొందరు కామెంట్ చేశారు..మరికొన్ని నెలల పాటు ప్రపంచం మొత్తం కరోనా ప్రభావం ఉండనుంది కాబట్టి, ప్రజల పనులు అంతకాలం మానుకోలేరు..అందుకే అందరూ థాయ్ లాండ్ షాపింగ్ మాల్ పద్దతి ఫాలో అయితే బెటరేమో..

Also read: కరోనా నేపథ్యంలో ఆటో డ్రైవర్ క్రియేటివిటీకి మహింద్ర చైర్మన్ ఫిదా!


End of Article

You may also like