“బంగార్రాజు” మూవీలో నటించిన ఈ ఎనిమిది మంది హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

“బంగార్రాజు” మూవీలో నటించిన ఈ ఎనిమిది మంది హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

Video Advertisement

తాజాగా.. ఈ సినిమాకు “బంగార్రాజు” అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన క్రితి శెట్టి నటించనున్నారు.

bangarraju trailer

అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో బంగార్రాజు సినిమా బృందం ఈవెంట్స్, ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఓ సారి నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమాలో 7 గురు హీరోయిన్స్ ఉంటారు అంటూ ఆసక్తి రేకిత్తించారు. ఈ విషయమై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా మాట్లాడారు.

bangarraju trailer 2

7 గురు కాదు.. ఈ సినిమాలో ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్స్ ఉంటారు అని చెప్పుకొచ్చారు. దీనితో.. ఈ సినిమాపై అంతకంతకూ ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఇంతకీ ఆ ఎనిమిది మంది హీరోయిన్స్ ఎవరు అని అడుగగా.. కృతి శెట్టి, రమ్య కృష్ణ, దర్శిని, దక్ష, వేదిక, మీనాక్షి దక్షిత్, ఫరియా అబ్దుల్లా, సిమ్రత్ కౌర్ అని సమాధానం ఇచ్చారు. వీరు పాటల్లోనూ, కొందరు స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలుగా కనిపిస్తారు అని సమాధానం చెప్పుకొచ్చారు.

bangarraju trailer 1

బంగార్రాజు సినిమా ఈ సంక్రాంతి సందర్భం గా శుక్రవారం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. మరోవైపు పెద్ద సినిమాలన్నీ రేస్ నుంచి తప్పుకోవడంతో.. బంగార్రాజు కు లైన్ క్లియర్ అయినట్లు ఉంది. మొత్తానికి ఈ సంక్రాంతి విన్నర్ గా బంగార్రాజు సినిమానే నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.


End of Article

You may also like