రాజ్ కుంద్రా తో కలిసి పనిచేసిన తారలు వీరే..! ఈ కేసు తో ఎవరెవరికి సంబంధం ఉందంటే..?

రాజ్ కుంద్రా తో కలిసి పనిచేసిన తారలు వీరే..! ఈ కేసు తో ఎవరెవరికి సంబంధం ఉందంటే..?

by Anudeep

Ads

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలను నిర్మిస్తున్నారన్న ఆరోపణలు రావడం తో ఆయనను అరెస్ట్ చేసారు. అయితే.. ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ క్రమం లో బాలీవుడ్ తారలతో ఎవరెవరితో రాజ్ కుంద్రా కు సంబంధం ఉందొ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Video Advertisement

raj kundra arrest 1

ఈ క్రమం లో ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు బాలీవుడ్ భామలను పోలీసులు విచారణ చేసినట్లు తెలుస్తోంది. గెహనా వశిష్ట్, పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా లు ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేసుకున్నారని సమాచారం. ఈ ముగ్గురు తారలకు ఇప్పటికే బాలీవుడ్ లో పాపులారిటీ ఉంది. వీరు రాజ్ కుంద్రా తో కలిసి పని చేసినట్లు పోలీసులకు వివరించారని సమాచారం. మరో వైపు వీరు కూడా రాజ్ కుంద్రా తో కలిసి కొన్ని అశ్లీల వీడియో లు రూపొందించడానికి ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది.

raj kundra 2

అయితే, గత కొంత కాలం వీరు రాజ్ కుంద్రా తో టచ్ లో లేమని తెలిపారట. అంతే కాదు పూనమ్ పాండే కొంతకాలం పాటు కలిసి పని చేసినప్పటికీ.. ఆర్ధిక గొడవలు కారణం గా ఒప్పందం కాన్సల్ చేసుకున్నారని తెలిపారట. ఇది ఇలా ఉంటె గతం లో పూనమ్ పాండే రాజ్ కుంద్రా పై కేసు పెట్టారు. పోర్న్ సైట్ లలో తన పర్సనల్ నెంబర్ ను పెట్టారంటూ ఆమె కేసు నమోదు చేసారు. ఈ కేసుకు సంబంధించి రాజ్ కుంద్రా పై కోర్ట్ జులై 23 వరకు రిమాండ్ ను విధించింది.

raj kundra 3

రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ ను యాప్ ల ద్వారా జనాలలోకి తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబై మోడల్స్ ను ట్రాప్ చేయడం, ఆ తరువాత వారి వీడియో లను ఆప్ (హాట్ షాట్) ద్వారా ప్రసారం చేస్తున్నారని తేలింది. రాజ్ కుంద్రా 2019 లో ఆర్మ్స్ ప్రైమ్ మీడియా అనే సంస్థను ప్రారంభించారట. ఆ తరువాత ఆరు నెలలకి ఈ సంస్థ హాట్ షాట్స్ అనే ఆప్ ను రూపొందించింది. దీనిని లండన్ కేంద్రం గా ఉన్న కెన్రిన్ అనే సంస్థ కి పాతిక వేల డాలర్ల కి అమ్మేసారట. ఆ తరువాత అదే ఏడాది డిసెంబర్ లో రాజ్ కుంద్రా ఈ సంస్థ కి రిజైన్ చేశారట.

raj kundra 4

ఆ తరువాత మూడు వాట్సాప్ గ్రూప్ ల సాయం తో ఈ హాట్ షాట్ యాప్ ను పబ్లిక్ లోకి తీసుకెళ్లారు. ఈ ఆప్ లోని అశ్లీల కంటెంట్ వల్లే యాప్ స్టోర్, ప్లే స్టోర్ లు ఈ అప్లికేషన్ ను తీసేసాయి. ఈ కేసు కు సంబంధించి విచారణ కొనసాగుతోంది. పోలీసులు ఈ వ్యవహారం తో సంబంధం ఉన్న పదకొండు మందిని అరెస్ట్ చేశారని సమాచారం. ఈ కేసు లో శిల్పా శెట్టి కి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు వివరించారు.


End of Article

You may also like