Ads
కరోనా మహమ్మారి వలన,ప్రపంచ దేశాలు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు కూడా బాగా దెబ్బ పడింది. అయినప్పటికీ 2022ని ఉత్సాహంగా ప్రారంభించింది. ఈ మేరకు కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా అందించింది. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఊహించినంత హిట్ ఇవ్వక పోగా, తీరని లోటును మిగిల్చాయి. ఇక జూలై నెల విషయానికి వేస్తే 50-50 అని చెప్పొచ్చు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వగా కొన్ని సినిమాలు ఒక మోస్తరుగా ఆడినట్లు చెప్పొచ్చు.
Video Advertisement
మరోవైపు ఆగస్ట్ లో రిలీజ్ అయిన సీతా రామమ్, బింబిసార మంచి హిట్ ఇవ్వగా…కార్తికేయ2 అయితే బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ తో సందడి చేస్తుంది. ఈ తరుణంలో సెప్టెంబరులో విడుదల అయ్యే సినిమాలు , తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి మైలురాయిగా మారుతయా లేదా? మళ్ళీ పూర్వపు బ్లాక్ బస్టర్ వైభవాన్ని తీసుకొస్తాయా లేదా అనే కోణంలో అటు ప్రేక్షకులు, ఇటు సినీ పరిశ్రమలోని పెద్దలు ఆలోచిస్తున్నారు.
కాగా ఇప్పుడు సెప్టెంబర్ లో తెరకెక్కనున్న సినిమాలు, వాటి విశేషాలు ఏంటో చూద్దాం. తొలుత సెప్టెంబర్ తొలి వారంలో గిరీసాయ దర్శకత్వం వహించిన వైష్ణవ్ తేజ్ మూవీ రంగ రంగ వైభవంగా విడుదల కానుంది. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన తర్వాత, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండ పొలం కూడా బాగానే ఆడింది. మరి ఎన్నో నెలలుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఎలా ఉంటందనేది చూడాలి.
తరువాత వారంలో శ్రీధర్ గడే డైరెక్ట్ చేసిన కిరణ్ అబ్బవరం మూవీ, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా విడుదల కానుంది. వరుస ఫ్లాప్స్ తరువాత విడుదల కానున్న ఈ సినిమా అందరినీ అలరిస్తుందని ఊహిస్తున్నారు ప్రేక్షకులు. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శర్వా నంద్ కు ఇటీవల పెద్ద హిట్స్ ఏమీ లేవు. మరి సెప్టెంబర్ 9 న, శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించిన మూవీ ఓకే ఒక జీవితం సినిమా విడుదల కానుంది. ఇది ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ఆ తరువాత నాగ శేఖర్ దర్శకత్వం వహించిన తమ్మన్నా, సత్య దేవ్ ల మూవీ గుర్తుందా శీతాకాలం విడుదల కానుంది. వీరు ఇటీవల వెబ్ సిరీస్ ల పైన మొగ్గు చూపారు. కాగా మళ్ళీ గ్యాప్ తరువాత తీయనున్న సినిమా ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ఇక నేరుగా మూడో వారానికి వస్తే, మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన, కృతి శెట్టి, సుధీర్ బాబు సినిమా, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి విడుదల కానుంది. ఉప్పెన తరువాత వరుసగా పెద్ద హీరోల సైతం, చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది కృతి శెట్టి. కానీ ఏ సినిమా కూడా అంత హిట్ ఇవ్వలేక పోయాయి. మరి ఇప్పుడు సుధీర్ బాబు సరసన వస్తున్న ఈ సినిమా హిట్ స్థానాన్ని భర్తీ చేస్తుందా లేదా అని చూడాలి.
ఇక సెప్టెంబర్ 16న సుధీర్ దర్శకత్వం వహించిన, రెజీనా, నివేథా థామస్ సినిమా శాకిని డాకిని విడుదల కానుంది. ఇదేదో వుమెన్ సెంట్రిక్ సినిమాలా కనిపిస్తుంది. మరి ఏ కాన్సెప్ట్ తో వస్తుందో కానీ ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందేమో చూడాలి. సెప్టెంబర్ నాలుగో వారానికి వెళితే అన్నిష్ కృష్ణ దర్శకత్వం వహించిన నాగశౌర్య సినిమా కృష్ణ వ్రిద విహారి తో పాటు… ప్రదీప్ వర్మ డైరెక్ట్ చేసిన శ్రీ విష్ణు మూవీ అల్లూరి తెరకెక్కనుంది.ఈ ఇద్దరు హీరోల సినిమాలపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా హిట్ ఇస్తాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక చివరిగా చిన్న సినిమాల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో చిత్రీకరించిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో వస్తోంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ తో పాటు పలువురు సీనియర్ నటులు నటించగా… ప్రేక్షకులకు పోన్నియన్ సెల్వన్ పై ఆసక్తి నెలకొంది. ఈ మేరకు సెప్టెంబర్ మాసం సినిమాల హడావిడిలో మునిగిపోయింది. ఆయా సినిమాల సంగతి విడుదల అయ్యాక ప్రేక్షకుల రివ్యూల ద్వారా తెలియనుంది.
source : https://telugu.filmyfocus.com/september-will-have-more-films/
End of Article