Ads
అన్నా రాజన్ 2017లో ‘అంగమలి డైరీస్’ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ తరవాత ఈ అమ్మడు వేలిపడింతె పుస్తకం సినిమాలో నటించి మెప్పించింది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాలో పృథ్వీరాజ్ భార్యగా నటించి ఈ నటి అలరించింది. అయితే ఈమెకి ఓ చేదు అనుభవం ఎదురైంది.
Video Advertisement
ఇంతకీ అసలేం అయ్యిందనేది చూస్తే.. మలయాళ నటి అన్నా రేష్మ రాజన కొత్త సిమ్ ని తీసుకుందాం అని ఓ టెలికాం కంపెనీ ఆఫీసుకి వెళ్ళింది. ఆ తరవాత ఆమెని లోపల ఉంచేసి తాళం పెట్టేశారట.
వివరాలని చూస్తే.. ఈ భామ అలువ మున్సిపల్ కార్యాలయం దగ్గర వుండే టెలికాం కంపెనీ ఆఫీస్ కి వెళ్లిందట. ఒక సిమ్ కార్డు కొనేందుకు. తరవాత ఆమెకి అక్కడ వారికి వాగ్వాదం జరగగా.. ఆమెను లోపలే ఉంచి తాళం పెట్టేశారట. అన్నా రాజన్ ఈ విషయం పైన పోలీసుల కి కంప్లైంట్ చేసింది. ఇరువురి మధ్య గొడవను పోలీసులు వచ్చి పరిష్కరించారు. అయితే ఈమె నటిగా కాకుండా ఓ సాధారణ అమ్మాయిలా వెళ్లిందట.
ముఖానికి మాస్కు ధరించి మాములుగా వెళ్లి సిమ్ కార్డు తీసుకోవాలనుకుంది. తరవాత గొడవ జరిగింది. అయితే కోపం వచ్చి వాళ్ళు లోపలే ఈమెని ఉంచేసి తాళం వేసారట. అన్నా రాజన్ ఈ విషయం పైన పోలీసులకి కంప్లైంట్ చేసింది.
ఇరువురి మధ్య గొడవను సాల్వ్ చేసేసారు. అయితే వారు ఈమెకి క్షమాపణలు చెప్పగా..ఆమె కేసు వెనక్కి తీసుకున్నారు. అన్నా రాజన్ దీని గురించి మాట్లాడుతూ.. లోపలే నన్ను ఉంచి తాళం పెట్టారని.. పోలీసుల కి కంప్లైంట్ చేయగా వాళ్లొచ్చి ఇరువురి మధ్య గొడవను సాల్వ్ చేసారని. నాకు క్షమాపణలు చెప్పడంతో నేను కేసు వెనక్కి తీసుకున్నాను అని ఆమె చెప్పారు.
End of Article