Ads
ఎప్పుడైనా ఇష్టపడినవాళ్లు మన పక్కన ఉంటే వాళ్ళు మనకి వాళ్ళు సరైనవారు కాదా అవునా అనే ప్రశ్న కలుగుతుంది. అలానే వాళ్లతో జీవితాంతం ఉండగలమా లేదా..? జీవితాంతం ఆనందంగా ఉండగలమా లేదా..? అనేవి మనలో వచ్చే ప్రశ్నలు. అలానే ఈ ప్రశ్న చాందిని చంద్రన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కి కూడా ఒక రోజు కలిగింది. ఆమె తన యొక్క కధని షేర్ చేసుకున్నారు.
Video Advertisement
ఆమె కూడా ఒక రోజు సందేహంలో పడింది. నిజంగా తన బాయ్ ఫ్రెండ్ తో ఆమె జీవితాంతం ఉండాలా లేదా జీవితాంతం ఆనందంగా ఉండగలమా లేదా అనేది ఆమెలో కలిగిన ప్రశ్నలు. 2016 లో జరిగిన సందర్భాన్ని ఆమె షేర్ చేసుకున్నారు. యూపీఎస్సీ పరీక్షలు రాసి ఈమె మే నెలలో ఒత్తిడికి గురయ్యారు.
తీవ్ర ఒత్తిడి కారణంగా ఆమె రిలీఫ్ పొందాలని తన బాయ్ ఫ్రెండ్ తో పాటు అలా నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడు వర్షం పడడంతో తన బాయ్ ఫ్రెండ్ తో ఆమె ఒకే గొడుగులో నడవడం మొదలు పెట్టారు. ఈ ఫోటోని టైమ్స్ ఆఫ్ ఇండియా క్లిక్ చేసింది. న్యూస్ పేపర్లో కూడా ఫోటో పడింది. ఆ తర్వాత రోజు ఈమె పరీక్ష పాస్ అవలేదు అని తెలిసింది.
ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన టాపర్స్ ఫోటోలతో పాటు ఈమె ఫోటో కూడా ఈ విధంగా పబ్లిష్ అయ్యింది. ఏది ఏమైనా తన బాయ్ ఫ్రెండ్ ఆ ఫోటోని తొలగించమని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి చెప్పారు. అయితే ఆ నిమిషం ఆమెకి ఏమనిపించింది అంటే యూపీఎస్సీ టాపర్లతో పేపర్ అంతా నిండిపోయి ఉంది అలాంటి సమయంలో నేను నా బాయ్ ఫ్రెండ్ తో నడుస్తున్న ఫోటో పడడంతో చాలా ఆనందం అనిపించింది.
ఏ సమయంలో ఉన్నాసరే తనతో నేను ఆనందంగా ఉండగలను.. ఎలాంటి దారిలో అయినా తనుంటే నడవచ్చు అని అనుకుందామె. ఆ తర్వాత ఆమె 2017లో యూపీఎస్సీ పరీక్షలు ని క్లియర్ చేశారు. తన బాయ్ ఫ్రెండ్ అరుణ్ సుదర్శన్ తో ఆమెకి వివాహం కూడా అయ్యింది. వీళ్ళ ప్రేమ కథని చూసిన వాళ్ళు అందరూ కూడా ఆనందంగా ట్వీట్ చేస్తున్నారు.
End of Article