Ads
చిత్రం : లవ్ స్టోరీ
Video Advertisement
నటీనటులు : నాగ చైతన్య, సాయి పల్లవి, ఈశ్వరి రావు, రాజీవ్ కనకాల, దేవయాని.
నిర్మాత : నారాయణ్ దాస్ కె నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు
దర్శకత్వం : శేఖర్ కమ్ముల
సంగీతం : పవన్ సిహెచ్
విడుదల తేదీ : సెప్టెంబర్ 24, 2021
లవ్ స్టోరీ రివ్యూ :
రేవంత్ (నాగ చైతన్య), ఒక జుంబా డాన్స్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతూ ఉంటాడు. ఒక రోజు రేవంత్, మౌనిక (సాయి పల్లవి) ని కలుస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ వారి ప్రేమకి కులం అడ్డు వస్తుంది. తర్వాత రేవంత్, మౌనిక ఏం చేశారు? హైదరాబాద్ కి వచ్చి మంచి స్థాయికి వెళ్దాం అనుకున్న వారి కల నిజం అయ్యిందా? వాళ్ళిద్దరూ కలిసారా? ఇదంతా తెలుసుకోవాలంటే మీరు లవ్ స్టోరీ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారు. ఇలాంటి అంశాలను తెరపై చూడటం మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నటన విషయానికొస్తే నాగ చైతన్య తన కెరీర్లో ఇప్పటి వరకు చేయని ఒక పాత్రని పోషించారు.
ఈ సినిమాలో మనకు ఒక కొత్త నాగ చైతన్య కనిపిస్తారు. సాయి పల్లవి కూడా అంతకు ముందు పాత్రలకు భిన్నమైన పాత్ర చేశారు. ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లవ్ స్టోరీ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసిన అంశం సంగీతం. పవన్ అంతకముందు రెహమాన్ దగ్గర పని చేశారు. ఈ సినిమాకి ఆయన అందించిన పాటలు ప్రధాన బలంగా నిలిచాయి. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో, థియేటర్లో చూడడానికి కూడా అంతే బాగున్నాయి. శేఖర్ కమ్ముల కూడా ఇప్పటి వరకు రొమాంటిక్ లవ్ స్టోరీస్ మాత్రమే తీశారు. కానీ ఈ సినిమాలో ఎమోషన్ యాడ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఎమోషన్స్, అలాగే ఆ ఎమోషన్స్ ని తెరపై చూపించిన నటీనటుల పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచాయి.
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల పెర్ఫార్మెన్స్
సంగీతం
సినిమాలో మాట్లాడిన అంశాలు
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ లో కొంచెం బోరింగ్ గా అనిపించే కొన్ని సీన్స్.
బలహీనమైన కథ.
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
లవ్ స్టోరీ సినిమాలో మంచి ఎమోషనల్ సీన్స్ తో పాటు బలమైన మెసేజ్ ఉన్నా కూడా శేఖర్ కమ్ముల మార్క్ సినిమా అయితే కాదు. శేఖర్ కమ్ముల స్టైల్ లో ఉండే మంచి ఫీల్ గుడ్ సినిమా చూద్దాం అనుకొని వెళ్ళిన వాళ్లు మాత్రం కొంచెం నిరాశ చెందే అవకాశాలు ఉన్నాయి..
End of Article