LOW BUDGET HIGH COLLECTIONS: 2023 లో చరిత్ర సృష్టించిన 8 తెలుగు సినిమాలు… చిన్న బడ్జెట్ పెద్ద విజయం….!

LOW BUDGET HIGH COLLECTIONS: 2023 లో చరిత్ర సృష్టించిన 8 తెలుగు సినిమాలు… చిన్న బడ్జెట్ పెద్ద విజయం….!

by Mounika Singaluri

Ads

2023 సంవత్సరం తెలుగు సినిమాలకు అంతంత మాత్రంగానే ఉంది. ఏడాది వందకు పైగా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో సూపర్ డూపర్ హిట్ అయినవి పది లోపే ఉన్నాయి. మంచి సినిమాలు గుర్తింపు తెచ్చుకున్నవి ఇంకొక 20 ఉంటాయి. ఇక మిగిలిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో ప్రేక్షకులకు తెలియదు. భారీ సక్సెస్ సాధిస్తాయి అనుకున్న పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా మిగిలాయి. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు మాత్రం పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 2023 సంవత్సరంలో చిన్న చిత్రాలుగా వచ్చి పెద్ద విజయాలు సాధించిన వాటి గురించి ఒకసారి పరిశీలిస్తే…

Video Advertisement

1.బేబీ:

2023లో తక్కువ బడ్జెట్‌తో వచ్చి చరిత్ర సృష్టించి అఖండ విజయాన్ని అందుకున్న చిత్రం ‘బేబి’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఇది రూ. 8 కోట్లు టార్గెట్‌తో వచ్చి రూ. 43 కోట్లు షేర్ వసూలు చేసింది. తద్వారా రూ. 35 కోట్లు లాభాలను సొంతం చేసుకుని సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

baby-movie

2.బలగం:

ప్రముఖ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘బలగం’. కుటుంబ విలువలను చాటి చెప్పే కథతో వచ్చిన ఈ మూవీకి కేవలం రూ. 1.15 కోట్లు బిజినెస్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఫుల్ రన్‌లో ఊహించని విధంగా రూ. 12.55 కోట్లు వరకూ షేర్ రాబట్టింది. తద్వారా ఇది రూ. 11.25 కోట్లు లాభాలతో సరికొత్త చరిత్రను సృష్టించింది.

Balagam movie review

3. సామజవరగమన:

ఈ ఏడాది మరో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీ శ్రీ విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచింది. ఈ సినిమా కేవలం రూ. 3.50 కోట్లు బడ్జెట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, 15 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. తద్వారా రూ. 11.50 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటింది.

Samajavaragamana

4.మ్యాడ్:

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన కామెడీ సినిమా ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం రూ. 2.50 కోట్లు బిజినెస్‌ను మాత్రమే చేసుకుంది. అయితే, ఈ మూవీకి అదిరిపోయే టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగా వచ్చింది. దీంతో ఇది రూ. 9.50 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 7 కోట్లు లాభాలను సొంతం చేసుకుంది.

5. బెదురులంక 2012:

కార్తికేయ గుమ్మకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. ఫన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం కూడా మంచి టాక్‌ను తెచ్చుకుని భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా రూ. 4.50 కోట్లు టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొత్తంగా రూ. 7 కోట్లు వరకూ షేర్ రాబట్టింది. దీంతో రూ. 2.50 కోట్లు లాభాలను అందుకుంది.

bedurulanka 2012 movie review

2023లో తక్కువ బడ్జెట్‌తో వచ్చి సక్సెస్ అయిన సినిమాల్లో ‘రైటర్ పద్మభూషణ్’, ‘మా ఊరి పొలిమేర 2’, ‘కోటబొమ్మాళి పీఎస్’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తంలో లాభాలు వచ్చాయి. ఇలా ఈ ఏడాది చాలా చిన్న సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుని.. ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసుకున్నాయి.


End of Article

You may also like