తక్కువ ఖర్చుతో ఇమ్మ్యూనిటి పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంట్లో ఉండే ఈ రెండు చాలు.!

తక్కువ ఖర్చుతో ఇమ్మ్యూనిటి పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంట్లో ఉండే ఈ రెండు చాలు.!

by Mohana Priya

Ads

ఏ ఆరోగ్య సమస్యను అయినా అడ్డుకోవాలంటే మొట్టమొదటగా కావలసినది రోగనిరోధకశక్తి. అది కూడా కరోనా విషయంలో అయితే రోగనిరోధక శక్తి ఇంకా అవసరం. దీని కోసం చాలామంది మెడికల్ షాప్ లలో దొరికే టాబ్లెట్ లు వాడతారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ కెమికల్ టాబ్లెట్ కైనా సైడ్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది.

Video Advertisement

అందుకే ఇంట్లో పదార్థాలతోనే మనకి కావాల్సిన ఔషధాలు తయారు చేసుకోవచ్చు. మనం రోజు ఆహారంలో వాడే ఎన్నో పదార్థాలు మనకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. పసుపు యాంటీబయోటిక్, క్యారెట్, ఆకుకూరలు, పాలు, మొదలైన పదార్థాలలో ఎన్నో విటమిన్లు ఉంటాయి.

 

అంతేకాకుండా నెయ్యి, జీలకర్ర, మిరియాలు, మెంతులు, పచ్చిమిర్చి ఇవి కూడా ఆరోగ్యానికి మంచివే. అలా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే కూడా మన ఇంట్లో పదార్ధాలను ఉపయోగించవచ్చు. ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలను తరచుగా తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

#1 తమలపాకు

భోజనం తిన్న తర్వాత కిళ్ళీ వేసుకోవడానికి తప్ప తమలపాకు ఎక్కువగా తినం. కానీ తమలపాకు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అందుకే ఎప్పుడైనా ఎక్కువగా తిన్న తర్వాత కిళ్ళీ వేసుకుంటాం.

#2 పల్లి పట్టి

పల్లీలను బెల్లం పాకం లో కలిపి చేసే ఆహార పదార్థాన్ని పల్లి పట్టి లేదా చిక్కి అంటారు. పల్లీలు, బెల్లం లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పల్లీల లో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి, ఫాస్పరస్ ఉంటాయి. అవి శరీరంలో రక్తం ఇంకా గ్లూకోజ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి.

బెల్లం వల్ల వ్యర్ధపదార్ధాలు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి. అంతేకాకుండా బెల్లంలో జింక్, సెలీనియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. బెల్లం మామూలుగా గడ్డలాగా ఉంటే ఎక్కువమంది తినడానికి ఇష్టపడరు కాబట్టి పల్లిపట్టి రూపంలో బెల్లం ఇంకా పల్లీలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇవి 10 నుండి 20 రోజుల వరకు తరచుగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ మాత్రమే కాకుండా ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా నాలుగు సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలు పైబడిన వాళ్ళు అయినా ఇవి తినొచ్చు.

అంతేకాకుండా ఇది వర్షాకాలం. కాబట్టి ఏ వ్యాధి అయినా తొందరగా సోకుతుంది. అందుకే రోగనిరోధక శక్తి అనేది ఎంతో అవసరం. అందుకోసం టాబ్లెట్లను ఆశ్రయించకుండా పైన చెప్పిన సూచనలను పాటిస్తే చాలు.


End of Article

You may also like