రోగ నిరోధక శక్తి తక్కువుంటే శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే.!

రోగ నిరోధక శక్తి తక్కువుంటే శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే.!

by Anudeep

Ads

“నాకు తిరుగు లేదు అని విర్రవీగిన మనిషిని..కంటికి కనిపంచని వైరస్ కదలకుండా చేస్తోంది..” ఇంతకుముందు తనకు ఇష్టమున్నట్టు బతికిన మనిషిని తన ఇష్టాలకు దూరం చేసింది..కేవలం భౌతిక దూరం మాత్రమే మనకి కరోనా సోకకుండా చేస్తుందని ,దానితో పాటు వ్యక్తిగత శుభ్రత ముఖ్యమని ముందు నుండి చెప్పుకుంటున్నాం..అందుకే ఈ లాక్ డౌన్ .. దాంతో పాటు మన రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే కరోనా బారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అనే మాట కూడా వింటున్నాం..మన ఇమ్యునిటి పవర్ తక్కువగా ఉందనడానికి గుర్తించే లక్షణాలు కొన్ని ఉన్నాయి..అవేంటో తెలుసుకుని ఇమ్యునిటి పవర్ ని పెంచుకునే మార్గాలు ఆలోచించండి..

Video Advertisement

Also Read >>> కరోనా బాధితుల్లో కొత్తగా మరో మూడు లక్షణాలు.

health tips telugu

health tips telugu

  • మన జీర్ణవ్యవస్థ చాలా కీలకం..మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం అయితే సరేసరి ..కానీ జీర్ణం అవ్వడంలో సమస్యలున్నాయంటే మనకు ఇమ్యునిటి పవర్ తక్కువగా ఉన్నట్టే..మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి..లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాలి..కాబట్టి జీర్ణక్రియను పటిష్టం చేస్కునేలా జాగ్రత్తలు తీసుకుంటే ఇమ్యునిటి పవర్ ని పెంచుకున్నట్టే..
  • మనకు ఏడాదికి మూడు సార్లు మాత్రమే జలుబు చేయాలి..వాతావరణ మార్పుల కారణంగా..అలా కాకుండా పదేపదే జలుబు బారిన పడుతున్నామంటే మనం వీక్ గా ఉన్నట్టే..కాబట్టి జలుబు నుండి ఉపశమనం పొందడం మాత్రమే కాదు, తరచుగా జలుబు బారిన పడకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి..మన ఇమ్యునిటి పవరే మనకు అనేక రోగాలనుండి దూరం చేయగలదు..కాబట్టి దాన్ని మెరుగుపర్చుకోవాలి.
health tips telugu

health tips telugu

  • ఇద్దరు వ్యక్తులు సమాన పని చేసినప్పటికి కొందరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు.మరికొందరు చాలా తక్కువ టైంలోనే అలసటకు గురౌతారు..ఇది కూడా రోగనిరోధక శక్తి తక్కువగా ఉందనడానికి సూచనే..
  • ఆరోగ్యవంతులైన వ్యక్తులకు గాయాలైనా చాలా త్వరగా తగ్గిపోతాయి..అదే ఇమ్యునిటి పవర్ తక్కువగా ఉన్నవారికి అదే గాయాలు తగ్గడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది.కొన్ని సార్లు ఆ గాయాలు అసలు మానవు కూడా..అప్పుడు శరీరం మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • చాలా చిన్నచిన్న విషయాలకు ఒత్తిడికి గురవడం, అసహనంగా ఫీలవడం కూడా ఇమ్యునిటి పవర్ తక్కువ ఉన్నది అనడానికి ఉదాహరణ..కొందరు ఎంత పెద్ద ఒత్తిడినైనా అధిగమించడానికి ప్రయత్నిస్తుంటారు తప్ప డీలా పడిపోరు..ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఇమ్యునిటి పవర్ ఉన్నవారిలో కనిపిస్తాయి..

పైవన్ని మనలో ఇమ్యునిటి పవర్ తక్కువగా ఉంది అనడానికి ఉదాహరణలు..కాబట్టి ఇమ్యునిటి పవర్ ని పెంచుకుంటే కరోనాని ఎదుర్కోవడానికి మనం సిద్దంగా ఉన్నట్టే..చిన్నపిల్లలు, గర్భిణులు,ముసలివాళ్లు కరోనా బారిన పడడానకి ప్రధాన కారణం వారిలో ఇమ్యునిటి పవర్ తక్కువగా ఉండడమే..కాబట్టి ఇమ్యునిటి పవర్ పెంచుకోవాలంటే ఆహారం మాత్రమే కాదు, అలవాట్లలో కూడా మార్పులు రావాలి..సూర్యరశ్మితగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి..చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి.

ఇమ్యునిటి పవర్ పెంచుకోవాలంటే ఏ ఏ ఆహారపదార్దాలు తినాలో కింద లింక్ ని క్లిక్ చేయండి. >> Link 


End of Article

You may also like