వంట ఇంటి గ్యాస్ ఎల్ పీ జి రీఫిల్ సిలిండర్ ని కేవలం ఒక మిస్డ్ కాల్ తో బుక్ చేసుకునే సౌకర్యం కేంద్ర ప్రభుత్వం మనకు కల్పించింది.దేశం లోని ఏ ప్రాంతం వారికైనా ఈ సౌకర్యం లభిస్తుంది.ఇండియన్ ఆయిల్ ఎల్‌పిజి కస్టమర్లు రీఫిల్ బుకింగ్ కోసం ఒకే మిస్డ్ కాల్ నంబర్ – 8454955555 ను ఉపయోగించి గ్యాస్ ను బుక్ చేసుకోవచ్చు అని శుక్రవారం నాడు అధికారికంగా ప్రకటించింది కేవలం మిస్డ్ కాల్ ద్వారా బుక్ చేయనున్న వినియోగదారుడికి ఎలాంటి చార్జులు పడవు.ఐవిఆర్‌ఎస్ లేదా వృద్ధాప్య కస్టమర్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఈ సౌకర్యం ఎంతో సహాయపడుతుందని ఒక ప్రకటన తెలిపింది.

LPG cylinder Gas booking By a Missed call

భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎల్‌పిజి వినియోగదారుల కోసం మిస్డ్ కాల్ సౌకర్యాన్ని ప్రారంభించారు.ఈ అవకాశం ద్వారా ప్రజలకి మరింత సులువుగా గ్యాస్ బుకింగ్ చేసుకునే సౌకర్యం లభిస్తుందని పలువురు చెబుతున్నారు కొత్త ఎల్ పి జి గ్యాస్ రీఫిల్ సిలిండర్ ను మిస్డ్ కాల్ ద్వారా పొందే అవకాశం ప్రస్థుటానికి భువనేశ్వర్ లో ప్రారంభించబడింది అతి త్వరలో దేశంలోని అన్ని ప్రాంతాలకి ఇది అందుబాటులో ఉంటుంది అని తెలిపారు అలాగే గ్యాస్ డెలివరీ ని వినియోగ దారుడికి చేరే సమయం ఒక రోజు నుండి కొన్ని గంటల్లో అందేలా చూడాలి అని గ్యాస్ ఏజెన్సీలు పలువురు వినియోగదారులు నుంచి సూచనలు వచ్చాయి అని తెలిపారు.