Ads
మహానటి సావిత్రి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహానటి లోనే ఆమె గొప్పతనం, ఆమె ట్యాలెంట్ మనకి అర్థమైపోయింది. చిన్నప్పటి నుండి ఆమె ఎన్నో కష్టాలని ఎదుర్కొని పైకి రావడం జరిగింది. మొదట ఆమెకి నటించడం రాదు, డైలాగులు చెప్పలేదు అన్న వాళ్ళకి ఆమె అంటే ఏమిటో నిరూపించారు సావిత్రి. అతి కొంత కాలంలోనే ఆమె ఎంతో పెద్ద స్టార్ అయిపోయారు. సర్పంచ్ భార్యగా ఆమె నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ సినిమాలో సావిత్రి ఎంత బలహీనంగా ఉన్నారో మనం చూశాం. అయితే ఆ సినిమా తర్వాత ఆమె ఒకటి రెండు సినిమాల్లో నటించారు.
Video Advertisement
అదే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక పాత్ర చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇలా జెమినీ గణేషన్ సావిత్రి తో మెగాస్టార్ నటించారు. అలానే 1988లో నాగేంద్రబాబు నిర్మాతగా కె.బాలచందర్ దర్శకత్వంలో రుద్రవీణ సినిమా వచ్చింది. ఆ సినిమాలో తండ్రీ కొడుకులుగా జెమినీ గణేషన్ చిరంజీవి నటించారు.
సినిమా హిట్ అవ్వకపోయినా ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయింది. జాతీయ సమైక్యతా చిత్రంగా ఈ సినిమాకి పురస్కారం వచ్చింది. చిరంజీవికి నంది అవార్డు కూడా తీసుకొచ్చింది.
జాతీయ ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజాకి కూడా గుర్తింపు రావడం.. ఎస్పీ బాలసుబ్రమణ్యంకి ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు రావడం జరిగింది. ఇలా సావిత్రి జెమిని గణేషన్ లతో నటించే అదృష్టం చిరంజీవికి కలిగిందని ఆయన ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు.
End of Article