స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఇరు తెలుగు రాష్ట్రాలలో హై టెన్షన్ నెలకొంది. కేస్ నిమిత్తం సీఐడీ చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం తో ..కోర్టు రిమాండ్ కు పంపవలసిందిగా నిర్ణయం తీసుకుంది.

Video Advertisement

అయితే ప్రస్తుతం ఈ నిర్ణయం వెనక కీలకపాత్ర పోషించిన రెండు సెక్షన్ల గురించి ఇరు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పాటు…ఈ సెక్షన్ అన్వయింపు పై న్యాయ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబును రిమాండ్ కు పంపవలసిందిగా సిపిఐ చేసిన అభ్యర్థనను విజయవాడ ఏసిబి కోర్టు న్యాయమూర్తి ఆమోదించడం జరిగింది. కోర్టు విచారణ సందర్భంగా సీఆర్పీసీలోని రెండు కీలక సెక్షన్ల పై కోర్టులో తీవ్రంగ వాదోపవాదాలు జరిగాయి.ఈ సెక్షన్లలో ఒక సెక్షన్ 409 కాగా.. మరొకటి సెక్షన్ 17ఏ. ఇందులో సెక్షన్ 490లో ఆస్తి బదలాయింపుకు లేదా నిధుల బదలాయింపుకు సంబంధించింది. అలాగే సెక్షన్ 17ఏ అవినీతి కేసుల్లో గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయొచ్చా లేదా అన్న విషయం పై..సాగింది.

m nageswara rao retired ips comments on chandrababu naidu arrest

చంద్రబాబుకు ఈ రెండు సెక్షన్లనూ అన్వయిస్తూ సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ పై చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా..ఇందులో సెక్షన్ 17ఏ ప్రకారం చంద్రబాబును అరెస్టు చేయాలి అంటే గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తెరపైకి తెచ్చారు. దీనికి ఉదాహరణగా అచ్చెన్నాయుడు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు.

m nageswara rao retired ips comments on chandrababu naidu arrest

దీని పై స్పందించిన సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చంద్రబాబు కేస్ విషయంలో సెక్షన్ 17ఏను తప్పుగా అన్వయించినట్లు కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపద్యంలో గతంలో అచ్చెన్నాయుడు కేసులో హైకోర్టు తీర్పు, రాఫెల్ కేసులో యశ్వంత్ సిన్హా విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఇప్పుడు తిరిగి గుర్తు చేశారు.ఏసీబీ కోర్టు అచ్చెన్నాయుడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని భావించి ఉంటుందని….కానీ అచ్చెన్నాయుడు కేసు తీర్పు ఇచ్చింది హైకోర్టు అని ఆయన స్పష్టం చేశారు.

అలాగే రాఫెల్ కేసులో సుప్రీంకోర్టు…సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి అని సూచించిన విషయం గుర్తు చేశారు. అంతేకాకుండా నాన్-బెయిలబుల్ నేరంలో ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు.. అతని వైపు న్యాయవాదులు ముందుగా బెయిలు కోసం దరఖాస్తు వేయాలి కానీ.. చంద్రబాబు లాయర్లు మాత్రం రిమాండ్ ను వ్యతిరేకించడానికి పరిమితం అయ్యారు.. అందుకే చంద్రబాబు జైలుకెళ్లారన్నారు.