“నా సినిమా కూడా ఆస్కార్ కి వెళ్ళాలి..!” అంటూ… ఆస్కార్ అవార్డ్స్ పై “మాధవన్” కామెంట్స్..!

“నా సినిమా కూడా ఆస్కార్ కి వెళ్ళాలి..!” అంటూ… ఆస్కార్ అవార్డ్స్ పై “మాధవన్” కామెంట్స్..!

by Anudeep

Ads

దేశం లో ప్రస్తుతం ఆస్కార్ ఫీవర్ నడుస్తోంది. సినీ పరిశ్రమలోనే అత్యుత్తమ మైనదిగా భావించే ఆస్కార్ నామినేషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఆస్కార్ కు గుజరాతీ చిత్రం “చల్లో షో” ను పంపుతున్నట్లు ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా ప్రకటించింది.

Video Advertisement

ఈ నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సహనటుడు దర్శన్ కుమార్‌తో కలిసి తన రాబోయే చిత్రం ధోకా రౌండ్ డి కార్నర్‌ను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్న ఆర్ మాధవన్ ఆస్కార్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

madhavan about oscar award
ఆస్కార్ గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆస్కార్ వంటి లేదా ఆస్కార్ కన్నా గొప్ప అవార్డు లు భారత్ లో కూడా ఉండాలని మాధవన్ అన్నారు. ఆస్కార్ నామినేషన్ కోసం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ మరియు ది కాశ్మీర్ ఫైల్స్‌ను కూడా పరిగణించాలని ఆయన వ్యగ్యం గా స్పందించారు. దీని కోసం కాంపైన్ కూడా మొదలు పెడతాం అంటూ ఆయన అన్నారు.
ఆస్కార్ 2022 కోసం ఛెలో షో బృందాన్ని ఆర్ మాధవన్ కూడా అభినందించారు. “వారికి (టీమ్‌కి) ఆల్ ది బెస్ట్ వారు వెళ్లి గెలిచి మమ్మల్ని గర్వపడేలా చేస్తారని ఆశిస్తున్నాను. ఒక దేశంగా మనం సినిమా పరిశ్రమలో కూడా రాణించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని మాధవన్ అన్నారు.

madhavan about oscar award
ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆస్కార్ నామినేషన్స్ గురించి మాట్లాడుతూ .. ఇవన్నీ నాకు అవసరం లేని విషయాలు అన్నారు.గుజరాతీ చిత్రం ‘చల్లో షో’ని ప్రభుత్వం భారతదేశ అధికారిక ప్రవేశంగా ఆస్కార్‌కు పంపింది. ఈ ప్రకటన చాలా మందికి షాక్ ఇచ్చింది. నిర్ణయం ప్రకటించినప్పటి నుండి, నెటిజన్లు తమ స్పందనలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

madhavan about oscar award

రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చిత్రాన్ని మాధవన్ దర్శకత్వం, రచన, నిర్మాణం వహించిన చిత్రం. భారతదేశంలో జూలై 1న విడుదలైన ఈ చిత్రం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్త మాధవన్ పోషించిన నంబి నారాయణన్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ మరియు సూర్య అతిధి పాత్రలు పోషించారు.


End of Article

You may also like