“మధుబాల” సినీ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదేనా..?

“మధుబాల” సినీ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదేనా..?

by Mohana Priya

Ads

ఈతరం వారికి తెలియకపోయినా ఇంతకు ముందు తరం వారికి మధుబాల సుపరిచితురాలు. ఒకానొక సమయంలో అటు తమిళ్ ఇటు తెలుగు మరియు హిందీ ఇండస్ట్రీలలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలు చేసిన నటి మధుబాల. ఒక దశకం పాటు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగినటువంటి ఈమె చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

Video Advertisement

తిరిగి ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది మధుబాల. ఇప్పుడు స్వీట్ కారం కాఫీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా మధు బాల తను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి గల కారణాల గురించి వివరించారు.

madhoo actor

1991లో అజయ్ దేవగన్ హీరోగా పూల్ ఔర్ కాటే అనే చిత్రం ద్వారా బాలీవుడ్ మూవీతో మధుబాల ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తరువాత హిందీలోనే కాకుండా ఇటు తెలుగు అటు తమిళ్ సినిమాల్లో కూడా ఎందరో స్టార్ హీరోల సరసన మధుబాల నటించారు. అయితే ఏ హీరోతో అయితే తన కెరీర్ ను మొదలుపెట్టిందో అదే హీరోకి తల్లి పాత్ర చేసే అవకాశం రావడంతో అది నచ్చక ఆ సినిమాలో నటించిన చేపేసిందట.

madhoo actor

ఇక సినిమాల్లో చేయకూడదు అనుకుని తగు కారణం కోసం వెతికిన మీకు పెళ్లి మంచి కారణంగా దొరికిందని ఆ తరువాత ఇండస్ట్రీలో తనకు తెలిసిన వాళ్లందరికీ లెటర్స్ రాసి ఇక సినిమాలు చేయడం లేదని తెలియపరచినట్టు మధుబాల చెప్పారు. అయితే అప్పట్లో హీరోయిన్స్ కి పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదని…అప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఎన్నో మార్పులు రావడంతో చాలా అడ్వాన్స్‌డ్ గా ఉందని అది ఎంతో సంతోషించదగ్గ విషయమని మధుబాల అన్నారు. ప్రస్తుతం మధుబాల చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.


End of Article

You may also like