Ads
సాధారణంగా గవర్నమెంట్ స్కూల్ అనగానే అరకొరకగా ఉండే సౌకర్యాలు, క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ అనే అభిప్రాయానికి జనాలు వచ్చేసారు అందువల్లనే వారు గవర్నమెంట్ స్కూల్లో తమ పిల్లలని జాయిన్ చెయ్యడం చాలా వరకు తగ్గించేసారు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో తగ్గుతూ వస్తున్న విద్యార్థుల సంఖ్య దీనికి ఉదాహరణ ప్రజలలో ఉన్న ఈ భావనను మార్చడం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నాయి. కానీ మధురవాడ కు చెందిన చిన గదిలి మండలంలోని చంద్రంపాలెం హైస్కూల్ అనేది అన్నింటికీ భిన్నంగా కార్పొరేట్ స్కూల్ కి పోటీ ఇచ్చే విధంగా ఉంది తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న తమ పిల్లల్ని అక్కడ మాన్పించి మరి ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు అంటే ఈ స్కూల్ యొక్క గొప్పదనం అర్థం చేసుకోవచ్చు.
Video Advertisement
1975 సంవత్సరంలో 100 మంది విద్యార్థులతో ప్రారంభం అయినా ఈ స్కూల్లో ప్రస్తుతం నాలుగు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రతి సంవత్సరం స్కూల్లో వేయ్యా నుండి పదిహేను వందల మంది విద్యార్థులు కొత్తగా జాయిన్ అవుతూ ఉంటారు. కార్పొరేట్ స్కూల్ల కి దీటుగా ఈ స్కూల్లో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో విద్యను బోధించడమేకాక స్కూల్ యొక్క విశాలమైన క్రీడామైదానంలో విద్యార్థుల చేత 26 రకాల పైగా క్రీడలను ఆడిస్తూ వారిని జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొనేలా చేస్తున్నారు అంతేకాక ఈ స్కూల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పై స్టూడెంట్ కి అవగాహన మరియు కంప్యూటర్ సంబంధించిన కోర్సులు కూడా నేర్పుతున్నారు.
ఈ స్కూల్ పట్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న గవర్నమెంట్ స్కూల్ గా ఈ చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ రికార్డు నమోదు చేసింది ఆ స్కూల్ ని ఈ స్థాయికి తీసుకు వచ్చినా ఉపాధ్యాయుల కృషి అభినందనీయం అన్ని స్కూల్ లలోను ఇదేవిధంగా విద్యాబోధన అనేది జరిగినట్లయితే పేదవాడు కార్పొరేట్ స్కూల్ల వెనుక వేలకు వేలు ఫీజులు కట్టి పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదు.
End of Article