మధ్యప్రదేశ్‌లోని పన్నాలో శనివారం ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి తన భార్యను హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తుపాకీ గాయాలతో ఉన్న మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అనంతరం సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలా మందికి అప్పులిచ్చిన ఆయన వారు తిరిగి ఇవ్వకపోవడం తో తీవ్ర నిరాశకు గురై తన భార్యను చంపి.. తర్వాత ఆత్మ హత్యకు పాల్పడ్డారు. అంతకు ముందు ఆయన ఒక వీడియో ని రికార్డు చేసి తన వద్ద అప్పు ఎగ్గొట్టిన వారి పేర్లను అందులో ప్రస్తావించారు.

Video Advertisement

పోలీసుల కథనం ప్రకారం.. పన్నాలోని కిషోరేగంజ్ ప్రాంతంలో సంజయ్ సేత్ కుటుంబం నివాసం ఉంటోంది. సంజయ్ టెక్స్‌టైల్ వ్యాపారి. శనివారం సాయంత్రం సంజయ్, భార్య మీనాలు తమ ఇంటి రెండో అంతస్తులో ఉండగా కాల్పుల శబ్దం వినిపించింది. కుటుంబసభ్యులు పైకి పరుగు పరుగున వెళ్లారు. అప్పటికే మీనా చనిపోయి రక్తపు మడుగులో పడి ఉంది. కొన ఊపిరితో ఉన్న సంజయ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. తన భార్య మీనాను తొలుత తుపాకితో కాల్చి.. తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

madhyapradesh businessman's letter before his death..

భాగేశ్వర్ ధామ్ భక్తుడైన సంజయ్.. ‘‘గురూజీ నన్ను క్షమించండి.. మరో జన్మంటూ ఉంటే మీ భక్తునిగా ఉంటాను’’ అని సూసైడ్ నోట్‌లో రాశారు. ఆత్మహత్యకు ముందు ఓ వీడియోను రికార్డ్ చేసిన సంజయ్.. తన వద్ద నుంచి అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఎగవేసిన వారు పేర్లను ప్రస్తావించారు. ‘‘దయచేసి నా కూతురు వివాహం కోసం నా డబ్బు తిరిగి ఇవ్వండి.. కోటి రూపాయలతో ఆమె పెళ్లిని చేయండి. నా కుమార్తె బ్యాంకు ఖాతాలో డబ్బు రూ. 29 లక్షలు లాకర్‌లో ఉన్నాయి. చాలా నగలుకూడా ఉన్నాయి. నా భార్య, నేను బతకలేక వెళ్ళిపోతున్నాం… పిల్లలు మమ్మల్ని క్షమించండి..” అంటూ ఆయన ఆ వీడియో లో కన్నీటి పర్యంతమయ్యారు.

madhyapradesh businessman's letter before his death..

పన్నా ఎస్పీ ధర్మరాజ్ మీనా మాట్లాడుతూ.. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలిపారు. ‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన.. విచారణ జరుగుతోంది. ప్రస్తుతం బయటి వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు కనిపించడం లేదు.. ఆ గదిలో దంపతులు ఇద్దరే ఉన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’’ అని వెల్లడించారు.