Home Filmy Adda బాలీవుడ్ ఎంట్రీ పై తన స్టైల్లో క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

బాలీవుడ్ ఎంట్రీ పై తన స్టైల్లో క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

by Anudeep

 

నాలుగు పదుల వయసులో కూడా వన్నె తరగని అందం మహేష్ బాబు ది. సూపర్ స్టార్ మహేష్ అందమైన రూపం తోనే కాదు, తన అందమైన వాక్చాతుర్యంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా తనదైన స్టైల్లో చమత్కారంగా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ  ఉంటారు. ఇప్పుడు అలాంటి సమాధానమే నెట్టింట్లో వైరల్ గా మారింది.

మేజర్ ట్రైలర్ లాంచ్ సమయంలో మీడియా మీ బాలీవుడ్ ఆరంగేట్రం ఎప్పుడు అని ప్రశ్నించగా, ఆయన హిందీలో కూడా రిలీజ్ అయ్యే తెలుగు సినిమా చేస్తానని సమాధానమిచ్చారు. ఈ విషయం కాస్త బయటకి పొక్కి వైరల్ గా మారింది.

సర్కార్ వారి పాట  సినిమా ప్రమోషన్ లో భాగంగా మే 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మహేష్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. హిందీ అరంగేట్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరియు అవి ఎలా వైరల్ అయ్యాయి అనే దాని  గురించి అతని మీడియా ప్రశ్నించింది. తాను ఏ భాషకి అతీతుడిని కానని  తనకు సినిమా అంటే ఇష్టమని, అన్ని భాషలను  గౌరవిస్తానని మహేష్ స్పష్టం చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు దూసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందని మహేష్ అన్నారు.

ఎస్ఎస్ రాజమౌళి తో తన తరువాతి చిత్రం పాన్ ఇండియా చిత్రమని మహేష్ స్పష్టం చేశారు. దానితో మహేష్ తనదైన శైలిలో రూమర్స్ కి బ్రేక్ వేశారు.

You may also like