ఏంటి తమన్ అన్నా… “గుంటూరు కారం” BGM కూడా కాపీయేనా..? ఏ సినిమా నుండి అంటే..?

ఏంటి తమన్ అన్నా… “గుంటూరు కారం” BGM కూడా కాపీయేనా..? ఏ సినిమా నుండి అంటే..?

by Anudeep

Ads

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాటలతో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో ట్రోల్స్‌తో అంతకంటే ఎక్కువే నెగెటివిటీ ఎదర్కుంటున్నాడు. గతకొంత కాలంగా థమన్‌పై వస్తున్న ట్రోల్స్‌ బహుశా ఏ సంగీత దర్శకుడిపైన కూడా రాలేదేమో. అంతలా థమన్‌పై ట్రోలింగ్‌ జరుగుతుంది. కాపీ క్యాట్‌ అని, ఓకే రకమైన నేపథ్య సంగీతం ఇస్తాడని బోలెడన్ని ట్రోల్స్ వస్తూనే ఉంటాయి.

Video Advertisement

అయితే ఈ మధ్య థమన్‌ పాటలు ఇండియా వైడ్‌గా క్రేజ్‌ తెచ్చుకోవడంతో కాస్త నెగెటీవిటీ తగ్గింది. ముఖ్యంగా ‘అలవైకుంఠపురం’, ‘క్రాక్‌’, ‘అఖండ’, ‘భీమ్లానాయక్‌’ వంటి పలు సినిమాలకు పాటలతో, నేపథ్య సంగీతంతో ఊపిరి పోయడంతో ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యాడు. అయితే థ‌మ‌న్ స్పీడు, జోష్‌, ట్రాక్ రికార్డు ఎంత గొప్ప‌గా ఉన్నా స‌రే, ఎప్పుడూ ఏదొక రీజ‌న్‌తో సోష‌ల్ మీడియాలో టార్గెట్ అవుతూనే ఉంటాడు.

trolls on thaman about mahesh gunturu karam mass strike music..!!

కాపీ ట్యూన్లు అని ఒక‌సారి, హీరోల‌ను ఆకాశానికెత్త‌డం పేరుతో మ‌రోసారి ఇలా రీజ‌న్ ఏదైతే ఏంటి ఏదో ర‌కంగా యాంటీ ఫ్యాన్స్ థ‌మ‌న్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మరోసారి ట్యూన్స్ రిపీట్ చేశాడంటూ నెట్టింట థమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేసారు నెటిజన్లు. తమన్ మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘గుంటూరు కారం’ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

trolls on thaman about mahesh gunturu karam mass strike music..!!

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి మాస్ స్ట్రైక్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. ఇక మాస్ స్ట్రైక్ వీడియోలో మహేష్ బాబు నిజంగా మిర్చీలా ఘాటెక్కించారు. దానికి తగినట్లుగా తమన్ అందించిన మ్యూజిక్.. ఫ్యాన్స్‌తో చిందులేయించింది. అయితే ఈ మాస్ స్ట్రైక్ వీడియోలోని మ్యూజిక్ కూడా తమన్ కాపీ చేసారంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

trolls on thaman about mahesh gunturu karam mass strike music..!!

ఈ మ్యూజిక్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’, విజయ్ సేతుపతి, సమంత నటించిన ‘కన్మణి, రాంబో, ఖతీజా’ మూవీల్లోని మ్యూజిక్ లాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దానికి సంబంధించిన వీడియోలను ఎడిట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Watch video:

https://www.instagram.com/reel/Cs8YkQEp-Nz/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

ALSO READ : “గుంటూరు కారం” సినిమాకి హైలైట్ అవ్వబోయేది ఇదేనా..?


End of Article

You may also like